వర్ణాశ్రమ ధర్మం

 

“ధర్మం” అంటే “కర్తవ్యం”
ఇది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది :

1. వర్ణం
2. ఆశ్రమం

“వర్ణం” అంటే “రంగు” ;
అంటే, “ఆరా” . . “జీవకాంతి” అన్నమాట
“ఆరా” అంటే మనిషి చుట్టూ ఉండే కాంతి వలయం
ఇది అంశాత్మ యొక్క పరిపక్వతాస్థాయిని బట్టి వుంటుంది ;
ఇది మన కర్తవ్యం, మన ధర్మం, మన ఆత్మ యొక్క
జ్ఞానాజ్ఞానాల స్థితిని బట్టి వుంటుంది

“ఆశ్రయం” అంటే “నిలయం”
దేహమే మన నిలయం

మనం ఎప్పుడు, ఏమి చేయాలన్నది
కేవలం మన ఆత్మస్థితిని బట్టే కాకుండా
మన దేహ వయోస్థితిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది

కేవలం జ్ఞానులే తమ స్వంత ధర్మం గురించి కానీ,
ఇతరుల ధర్మం గురించి కానీ, నిజస్వరూపం తెలుసుకోగలరు.

జ్ఞానులు కానివారు తమ స్వధర్మం గురించి తెలుసుకోలేరు;
ఇతరుల ధర్మం గురించి అంతకన్నా తెలుసుకోలేరు.