పునర్జన్మ

 

“నిరుక్తం” అన్నది ఒకానొక ముఖ్యమైన వేదాంగం:

అది పునర్జన్మ గురించి ఇలా చెప్తోంది:

మృతత్చాహం పునర్జాతో జాతశ్చాహం పునర్ మృతః

నానా యోని సహస్రాణి మయోషితాని యానివై”

= నిరుక్తం

“జ్ఞాని అయినవాడు – నేను చాలాసార్లు పుట్టాను, మరణించాను; ఎన్నో యోనులలో నివసించాను’ అని తెలుసుకుంటాడు”

“నిరుక్తం” ఇంకా ఇలా చెప్తోంది:

“ఆహారా వివిధా భుక్తా పీతా నానావిధా స్తనాః ;

మాతరో వివిధ దృష్టా పితరః సుహృదస్తథా”

= నిరుక్తం

“జ్ఞాని అయినవాడు – ‘ఆ యోనులలో ఎన్నో రకాల ఆహారాలు తిన్నాను; ఎంతో మంది తల్లుల పాలు త్రాగాను; ఎంతో మంది తండ్రులను, సహృదయులను చూశాను’ అని అర్థం చేసుకుంటాడు”

దయానంద – గోపదేవ్ ఆధారంగా