పురుష ప్రయత్నం

 

వసిష్ట గీతలో

“పురుష ప్రయత్నం” గురించి ఈ విధంగా చెప్పబడింది;

 

“ద్వౌహుడావివ యద్యేతే పురుషార్థే సమాసమౌ

ప్రాక్తనశ్చైవ శామ్యత్యత్రాల్ప వీర్యవాన్

– వసిష్ట గీత (2-19)

పూర్వ జన్మ యొక్క ఈ జన్మ యొక్క సమాన, అసమాన
పురుష ప్రయత్నాలు ‘రెండు పొట్టేళ్ళ’ లాగా పరస్పరం
యుద్ధం చేస్తాయి; అందులో అల్పబలం కలది ఓడిపోతుంది”

 

“పౌరషం చ న వానస్తం యత్నమభివాంఛ్యతే

న యత్నేనాపి మహతా ప్రాప్యతే రత్న మశ్మతః”

– వసిష్ట గీత (2-36)

“మోక్షప్రాప్తికి అనంతకాలం వరకు పురుష ప్రయత్నం
అవసరం లేదు; ఎక్కువ పరిశ్రమ కూడా అవసరం లేదు
రత్న తత్వ పరీక్షా నిపుణులకు శ్రమ లేదుకనుక రాయిలోంచి
రత్నం లభిస్తోంది కదా.”

 

“ఆలస్యం యది న భవేజ్ఞ గత్యనర్థః

కోన స్యాద్భహుధనకో బహుశ్రుతో వా”

 

” ఈ ప్రపంచంలో అనర్థకారణమైనటువంటి ‘సోమరితనం’ అనేదే లేకపోతే
ఎవడు మహాధనికుడిలా, మహావిద్వాంసుడిలా కాకుండా ఉండగలడు?”

– వసిష్టగీత (2-41)

– (శ్రీ శ్రీ విద్యా ప్రకాశనందగిరి స్వామి)

 

పురుష ప్రయత్నమే అన్నిటికీ మూలం
అంతేకానీ ‘విధి విలాసం’, ‘లలాట లిఖితం’,
‘దైవ-లీల’ – ఇలాంటివన్నీ అర్థరహిత శుష్కపదాలే.