సంకల్ప బలం
బలం వున్నవాడు బలవంతుడు
బలం లేనివాడు బలహీనుడు
బలవంతులెప్పుడూ బలవంతుల అనుయాయులే
బలం అన్నది రెండు రకాలు: ఒకటి పశు బలం, రెండు సంకల్ప బలం
పశు బలం తిండితో వచ్చేది : సంకల్ప బలం జ్ఞానశుద్ధత తో వచ్చేది.
పశు బలం అన్నది ఎప్పుడూ సంకల్ప బలం ముందు దిగదుడుపే..
మనం అనుకున్నవన్నీ సాధించాలంటే సంకల్ప బలం అన్నది అనివార్యం
సంకల్ప బలం సమృద్ధిగా ఉండాలంటే ఎప్పుడూ సంకల్పం ఉండాలి కానీ
వికల్పం ఉండకూడదు.
వికల్పం అంటే అనుమానం : వికల్పం అంటే అసందిగ్ధత,
మన సంకల్ప బలం పెరగాలంటే మనకన్నా ఎక్కువ సంకల్ప బలం వున్న
వారితో సాంగత్యం పెరగాలి.
సంకల్ప బలం పెరగాలంటే సంకల్ప బలం అనే అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి
దాని తీరుతెన్నులను ఆకళింపు చేసుకోవాలి, దైనందిన జీవితంలో అనేకానేక సంకల్ప ప్రయోగాలు చేసి కారణ – కార్య సిద్ధాంత అనుభవాన్నీ సంపాదించుకోవాలి.
చిన్న చిన్న ప్రయోగాలతో మొదలు పెట్టి అచిర కాలంలో పెద్ద పెద్ద ప్రయోగాలకు పూనుకోవాలి.
పిల్లలకు చిన్నప్పటి నుంచే సంకల్ప బలాన్నిప్రభోధించాలి; వృద్ధులకు గుర్తు చేయాలి;
అనారోగ్యాలనన్నిటినీ సంకల్ప బలంతో పోగొట్టుకోవాలి – అదే సరైనా చికిత్సా విధానం; సంసారంలోని ఒడుదుడుకులనూ సంకల్ప బలంతోనే ఎదుర్కోవాలి..
మన నిర్వాణ పథంలో అవరోధాలను సంకల్ప బలం తోనే అధిగమించాలి.
సంకల్ప బలం జిందాబాద్…