సత్యమేవ జయతే

 

 

“సత్యమేవ జయతే నానృతం, సత్యేన పంథా వితతో దేవయానః

యేనాక్రమన్తి ఋషయో హ్యాప్తకామా, యత్ర తత్ సత్యస్య పరమం విధానం

= మండకోపనిషత్ (3-6)

సత్యమేవ జయతే = సత్యం .. ఆత్మ.. మాత్రమే జయిస్తుంది నిత్యమైనదే సత్యంనిత్యం కానిది అసత్యం
న అనృతం = అనాత్మ ఎప్పుడూ జయించదు.
సత్యేన దేవయానః = ఆత్మజ్ఞానం చేతనే ఊర్థ్వలోక ప్రాప్తి
పంథా వితతః = మార్గం ఏర్పడి ఉంది
యేన = దేనిచేతనైతే
ఆప్తకామాః ఋషయః = కోరికలు తీరిన ఋషులు . . ధ్యాన యోగులు
యత్ర = ఎక్కడైతే
సత్యస్య = సత్యం . . ఆత్మతత్త్వం .. యొక్క
తత్ పరమం విధానం = ఆ పరమ పదం (అస్తి = ఉన్నదో తత్ర = అక్కడికి)
ఆక్రమంతి హి = చేరుకుంటారు
  • కోరికలన్నీ తీరిన ఋషులు ధ్యానమార్గం ద్వారానే, సత్యనిలయమైన పరమపదాన్ని చేరుకుంటారు; దేవయానం చేస్తారు
  • దేవయానం వేరే, పితృయానం వేరే
  • ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే సత్యలోకప్రాప్తి లభిస్తుంది
  • ఆత్మజ్ఞానం అన్నది లేకపోతే లభించేది కేవలం పితృయానమే .. దానివల్ల పునరపి జననమే, పునరపి మరణమే.