ఉపనయనం – యజ్ఞోపవీతం

 

 

“ఉపనయనం” అయినవాడు ..
అంటే, బ్రాహ్మణత్వం పొంది ద్విజుడు అయినవాడు ..
ఇక తప్పనిసరిగా “యజ్ఞోపవీతం” ధరిస్తాడు

“యజ్ఞోపవీతం” అంటే ” ‘యజ్ఞం’ అనబడే ‘ఉపవీతం’”
“యజ్ఞం” అంటే “పరుల సేవార్థమై చేసే కర్మ”
స్వార్థవిరుద్ధకర్మలన్నమాట .. లోకకళ్యాణకరమైన చేష్టలన్నమాట
“ఉపవీతం” అంటే “బట్ట”, “నూలుప్రోగు”
“ఉపనయనం” అంటే “దివ్యచక్షువు”
“ఉపనయనం అయినవాడు యజ్ఞోపవీతం ధరిస్తాడు” 
అంటే
“దివ్యచక్షువును సంపాదించుకున్న ఒకానొక యోగి ఇంక తన సహచరుల 
ఆత్మజ్ఞానాభివృద్ధికి తన సర్వశక్తియుక్తులతో తోడ్పడతాడు” 
అని అర్థం
“జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం” 
అన్నాడు గీతాకారుడు
“జ్ఞానం” అనే అగ్నిలో అశుభకర్మలు దగ్ధమైన తరువాత ఇంక
మిగిలివుండే శుభ, నిస్వార్థపూరక కర్మలే ” యజ్ఞం “

అందుకే, జీసస్ ఆదేశించాడు
“నీ సహచరులనూ నీలాగే ప్రేమించు” అని 
అంటే “యజ్ఞోపవీతధారణ చేయి” అన్నమాట