క్షణ క్షణం జాగ్రత్త
“క్షణక్షణ జాగ్రత్త”
అనేది ధ్యానం ద్వారానే,
దివ్యజ్ఞానప్రకాశం ద్వారానే,
మనకు లభ్యమయ్యే స్థితి.
ఈ స్థితిలో “సదా మెలకువ” తో
వుండడం జరుగుతూ ఉంటుంది.
ఎప్పుడూ “వర్తమాన స్ఫూర్తి” నే కలిగి వుంటాం.
భూత భవిష్యత్ కాలాల ఛాయలు వర్తమానం మీద
ప్రణాళిక భద్ధంగా
కావలంటేనే పడతాయి; అనుకుంటేనే వుంటాయి.
ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్ర విద్యార్థి,
ధ్యానంలో నిష్ణాతుడైన తరువాత,
దివ్యజ్ఞానప్రకాశం కలిగిన తరువాత,
పూర్ణ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడైన తరువాత,
నిరంతరం అభ్యాసం చేయవలసిన స్థితే
నిత్య జాగ్రత్త అదే “క్షణ క్షణ జాగ్రత్త (awareness) “
మన “లోపలి” పరిస్థితులు కానీ,
మన “బయటి” పరిస్థితులు కానీ,
క్షణక్షణం రూపాంతరం చెందుతూనే ఉంటాయి.
ఏదీ స్థిరమైనది కాదు, ప్రతీదీ తాత్కాలికమే;
ప్రతీదీ చైతన్యవంతమే, ప్రతీదీ రూపుమారేదే.
- నిరంతరంగా మారే లోకంలో, ప్రస్తుత సందర్భాన్నీ, ప్రస్తుత సమస్యనూ గుర్తించి దానికి అనుగుణంగా ప్రతిక్షణమూ జాగరూకతతో మెలగడమే క్షణక్షణ జాగ్రత్త స్థితి