చిత్తవృత్తి నిరోధం

 

“చిత్తస్సదమథో సాధు, చిత్తం దస్త సుఖావహం”
“చిత్తం యొక్క నిగ్రహం పరమ యోగ్యం –
నిగ్రహింపబడిన చిత్తం సుఖప్రదం” 
అన్నాడు బుద్ధుడు ధమ్మపదంలో

“యోగః శ్చిత్త వృత్తి నిరోధః” 
అవి అన్నారు పతంజలి మహర్షి
దివ్యచక్షువు ఉత్తేజితానికి ముందు
చిత్తవృత్తుల నిరోధం అవసరం
చిత్తవృత్తి నిరోధం అయిన వెంటనే
కుండలినీ మేలుకొనడం మొదలవుతుంది
“చిత్తవృత్తి నిరోధం” అంటే మనస్సునూ, బుద్ధినీ శూన్యం చేసుకోవడం
ఉదాహరణకు:
ధ్యాని కాని వాడి చిత్తం ..
“హైదరాబాద్ అబిడ్స్ రోడ్డు సాయంత్రం 6 గంటల సమయం”
మాదిరి గజిబిజిగా ఎప్పుడూ ఉంటుంది
అయితే, ఆనాపానసతి ద్వారా అదే చిత్తాన్ని
“హైదరాబాద్ అబిడ్స్ రోడ్డు రాత్రి రెండు గంటల సమయం” 
మాదిరి నిర్మానుష్యం చేసుకోగలం
మనస్సులో వున్న పనికిరాని ఆలోచనా పరంపరల 
గందరగోళం నుంచీ
రణగొణ ధ్వనుల నుంచీ
ప్రశాంతమైన స్థితికి చిత్తాన్ని మళ్ళించడమే చిత్తవృత్తి నిరోధం

“నిశ్చల చిత్తే జీవన్ముక్తిః” 
అన్నారు కదా శంకరాచార్యులు
* “చిత్తం నిశ్చలమైతే అదే ముక్తి”