చువాంగ్ ట్జు
చైనా దేశపు అత్యుత్తమ ఋషి,
మహోత్తమ ఆధ్యాత్మిక తత్వవేత్త “చువాంగ్ ట్జు” ;
గౌతమబుద్ధుడి సమకాలికుడు
ఆయన చెప్పిన కొన్ని సూక్తులు:
” ‘జీవితం’ వుంటే ‘చావు’ వుంటుంది;
అలాగే ‘చావు’ వుంటే మళ్ళీ ‘జీవితం’ కూడా వుంటుంది”
“బుద్ధికుశలురు మాత్రమే ‘ఈ ఉన్నదంతా ఒకటే’ అని తెలుసుకుంటారు”
“ఉత్తమ పురుషుడు ఎప్పుడూ ఆధ్యాత్మిక విజ్ఞానే.
అతనికి చావు పుట్టుకలు అంటవు;
అలాంటివాడిని ప్రాపంచిక లాభనష్టాలు ఏమీ చేయలేవు”
“జనన-మరణ చక్రం గురించీ, ‘కాలం’ గురించీ ‘శుభాశుభాల’ గురించీ
మరచిపోండి; అనంతత్వంలో విశ్రాంతి పొందండి”
“నిజమైన జ్ఞానం దొరకాలి అంటే మనిషి ముందుగా త్రికరణశుద్ధి కలిగివుండాలి”
“జ్ఞానులు, ‘మా శరీరాలు వేరు, మేం వేరు’ అని తెలుసుకున్నవారు”
“జ్ఞానికి శారీరక నాశనమే వుంది కానీ ఆత్మ నాశనం లేదు;
‘స్థల మార్పిడి’ వుంది కానీ ‘నిజమైన నాశనం’ లేదు”
- “చువాంగ్ ట్జు”, “లావో ట్జు” లాంటి చైనా దేశపు మహాజ్ఞానుల పుస్తకాలు చదివితేనే సుజ్ఞానం;
అప్పుడే శాస్త్రీయ ఆధ్యాత్మికత అన్నది అలవడేది.