చేత – వ్రాత

 

“వ్రాత వెంట గానీ వరమీడు దైవంబు;
‘చేత’ కొలది గానీ ‘వ్రాత’ రాదు
వ్రాత కజుడు కర్త, చేతకు దా గర్త;
విశ్వదాభిరామ వినుర వేమ!”

“వ్రాత” అంటే “విధి”
“చేత” అంటే “స్వీయ స్వేచ్ఛాకర్మ”

మనం చేసే కర్మలే మన ‘వ్రాత’ గా మారుతాయి;
మన చేతల ప్రకారమే
మనకు ‘అదృష్ట’,’దురదృష్టాలు’ సంభవిస్తాయి;
మన పూర్వకర్మల ప్రకారం
మనం అనుభవించవలసింది మనం పుట్టే ముందు
మనమే నిర్ణయించుకుని పుడతాం;
అవే “ప్రారబ్ధ కర్మలు”
దీనినే “వ్రాత కజుడు కర్త” అని వేమన నిర్వచించాడు
“అజుడు” అంటే “అజ” . . “పుట్టక ముందు” అన్నమాట
మన చేతలకు ఎప్పుడూ మనమే కారకులం
మన వర్తమానమే కర్మలు ఎప్పుడూ మన చేతులలోనే వుంటాయి
దీనినే “చేతకు దా గర్త” అని యోగివేమన విశదీకరించారు.

 

  • కనుక, మన ప్రారబ్ధాన్ని సంతోషంగా స్వీకరిస్తూ,
    మన వర్తమానాన్ని ఎప్పటికప్పుడు ధర్మయుక్తంగా, జ్ఞానయుక్తంగా,
    యోగయుక్తంగా ఉండేటట్లు తీర్చిదిద్దుకుంటూ వుండాలి.