జలాలుద్దీన్ రూమీ
పర్షియా దేశీయుడైన
“జలాలుద్దీన్ రూమీ”
గొప్ప సూఫీ మాస్టర్.
సుమారు 700 సంవత్సరాలు అయ్యింది ..
భూమండలం ఆ ధృవతారతో పులకించింది.
ఆయన చెప్పిన ఒకానొక సత్యవాక్కు:
“నేను ‘ఖనిజం’లా చనిపోయి ‘మొక్క’గా మారాను;
మొక్కగా చనిపోయి ‘జంతువు’లా పుట్టాను;
జంతువుగా చనిపోయి ‘మనిషి’గా అవతరించాను;
ఇంక దేనికి భయపడాలి నేను ?
చనిపోవడం వలన నేను ఎప్పుడు నష్టపోయాను ?
అంతేకాదు, మనిషి లాగా కూడా చస్తాను ;
చనిపోయి ‘దేవత‘గా దేవలోకాలకు వెళ్తాను.
అక్కడి నుంచి కూడా ఇంకా ఇంకా పై లోకాలకు వెళ్ళవచ్చు.
ఇంకా పైపైకి వెళ్ళి, ఎవ్వరూ ఊహించలేనంతటి స్థితికి చేరుకుంటానేమో ?”
- ఆత్మకు ఎన్నో జన్మలు, మరెన్నో లోకాలు, అనంతమైన అనుభవాలు.
- “జీవితం అనేది అనంతమైన, శాశ్వతమైన పరిధులు లేని, మహావినోద, మహావిజ్ఞాన యాత్ర” ..
ఇదే శ్రీ జలాలుద్దీన్ రూమీ జీవిత అనుభవసారం.