జొరాస్టర్

 

జొరాస్ట్రియన్ మత స్థాపకుడైన

జొరాస్టర్

మహా ఋషి, మహా ద్రష్ట.

అయన చెప్పిన ఒక ఆణిముత్యం:

“మీకున్న దానితో (వస్తు సముదాయాలతో) ఎప్పుడు సంతృప్తులై వుండండి;

కానీ, ‘మీ’ తో అంటే, ‘మీ ఆత్మాభివృద్ధి’ తో మాత్రం ఎప్పుడూ సంతృప్తులు కాబోవద్దు.”

మరొక ముత్యం:

“మీ ‘ఆత్మ’ అనబడే ‘నదీ ప్రవాహాల’ ను శోధించండి;

మీ పరిణామక్రమాల గురించి ఆలోచించండి”

అంటే,

“మీ గతజన్మల గురించీ, పూర్ణాత్మ గురించీ, మీరు పరిశోధించండి” –

అన్నదే జొరాస్టర్ సందేశం.

 

  • జొరాస్టర్ లాంటి పరమ ఆచార్యులందరూ తెలిపేవే పరమసత్యాలుఅవే పరమ ఆచారాలు
  • ఆచార్యుడు చెప్పిందే ‘ఆచరణీయం’ ‘ఆచారం’.