జ్ఞానయుగం

 

ధ్యానయుగం అంటే జ్ఞానయుగం అన్నమాట.

ఎందుకంటే ధ్యానం ద్వారానే జ్ఞానం లభిస్తుంది కనుక,

ధ్యానం వినా జ్ఞానం లేదు కనుక,

జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం

జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం

ఆత్మజ్ఞానం అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మను అని.

ధ్యానయుగమే జ్ఞానయుగానికి నాంది.

ధ్యానయుగం ద్వారానే ఈ భూమండలంలో జ్ఞానయుగం స్థాపింపబడగలదు.

అజ్ఞానం దుఃఖానికి మూలం.

అజ్ఞానం అనారోగ్యానికి మూలం.

అజ్ఞానం యుద్ధాలకు మూలం.

అజ్ఞానం వృద్ధాప్యానికి మూలం.

అజ్ఞానం అకాల మరణానికి మూలం.

ధ్యానాన్ని స్థాపిద్దాం. అజ్ఞానాన్ని వధిద్దాం.