డాన్ యువాన్
ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో,
ఆధ్యాత్మికశాస్త్ర అధ్యాపకులలో,
ప్రప్రథమశ్రేణి వారు డాన్ యువాన్లు
డాన్యువాన్ చెప్పిన ఒక సూత్రం ..
“జిజ్ఞాసువు ‘ముముక్షువు’ అయినప్పుడు
అచిరకాలంలోనే అతడు ‘జ్ఞాని’ గా మారి
సాధనా పరిసమాప్తి ద్వారా చివరికి ‘ద్రష్ట’ అవుతాడు”
ఆధ్యాత్మిక విద్యాభ్యాస విధివిధాన క్రమంలో
వున్నవి నాలుగు దశలు
“జిజ్ఞాసువు” .. “ముముక్షువు”
“జ్ఞాని” .. “ద్రష్ట, ఋషి”
“జిజ్ఞాసువు” అంటే సత్యసిద్ధి ప్రాప్తికి
ప్రప్రధమంగా దృఢనిశ్చయుడు అయినవాడు
“ముముక్షువు” అంటే ఇక సత్యశోధనలో, సత్యసాధనలో
పూర్తిగా నిమగ్నుడైనవాడు
“జ్ఞాని” అంటే సత్యసాధనా చివరి దశలలో
సత్యసిద్ధి పొందినవాడు
“ద్రష్ట” , “ఋషి”, అంటే దివ్యచక్షువు కలిగినవాడు;
ఇతరలోకాలను వీక్షించగలిగినవాడు.
- డాన్ యువాన్ గురించీ .. మరి అతని ఇతర గురువుల, సహచరుల,
యోగసిద్ధుల గురించీ .. వారందరి పరిపక్వ ఆత్మజ్ఞానం గురించీ ..
డాన్ యువాన్ శిష్యుడు కార్లోస్ కాస్టానెడా వ్రాసిన
అద్భుత పుస్తకాలను ఇంగ్లీషు భాష తెలిసినవారు
చదివితీరాలి, అధ్యయనం చేసితీరాలి.