డూ ఆర్ డై

 

 

శ్రీ సదానంద యోగి . . కర్నూలు స్వామీజీ ..
ఎప్పుడూ నాతో అంటూండేవారు . .
సుభాష్ చేయి లేకపోతే చావు.” అని

” DO
OR
DIE.” అని

వేమన యోగి కూడా ఇదే పలుకు పలికాడు :
“పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టు పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టి విడుట కంటే, పడి చచ్చుటమేలు –
విశ్వదాభిరామ వినుర వేమ.”

బుద్ధుడు కూడా “ధమ్మపదం” లో ఇలానే అన్నాడు :
కయిరా చే కయిరాథేనందళ్హమేనం పరక్కమే”
“కుర్యాచ్చేత్ కుర్వీతైతద్, దృఢమేతత్ పరాక్రమేత” -(సంస్కృతం)

“ఏ పని చేయాలన్నా దృఢమైన నిష్ఠతో, సామర్థ్యంతో చేయాలు”

ఏ పనినైనా తలపెట్టేముందు “అది న్యాయమాఅన్యాయమా ? “,
క్రమమా అక్రమమా ?” . .
శుభమా ఆశుభమా ? ” అని మొదట బేరీజు వేసుకుని ఆ
తర్వాత న్యాయమైనదీసక్రమమైనదీ,
శుభమైనదీ అయితే దృఢచిత్తంతో దానిని చేసే తీరాలుచావుకు
కూడా భయపడరాదు