తస్మాత్ యోగీభవ
భగవద్గీతలో
కృష్ణుడు ఇలా అన్నాడు :
“తపస్విభ్యోధికో యోగీ, జ్ఞానిభ్యోపి మతోధికః |
కర్మిభ్యశ్చాధికో యోగీ, తస్మాత్ యోగీ భవార్జున ||”
= గీత (6-16)
అంటే,
“ఒకానొక తాపసి కన్నా ఒకానొక యోగి అధికుడు;
ఒకానొక జ్ఞాని కన్నా ఒకానొక యోగి అధికుడు అని నేను అనుకుంటున్నాను;
రకరకాల కర్మలు చేసేవాడికన్నా అధికుడు ఒకానొక యోగి;
కనుక, ఓ అర్జునా, యోగివి కా,” అని
“తాపసి” అంటే . . శరీరాన్ని తపింప చేసుకునేవాడు . .
అంటే . . ఉపవాసాలు మొదలైన వాటి ద్వారా,
“జ్ఞాని” అంటే శాస్త్రాధ్యాయనపరంగా సత్యం తెలుసుకున్నవాడు.
“యోగః” అంటే ధ్యానం; “యోగి” అంటే
“ధ్యానంలో నిష్ణాతుడైనవాడు = ధ్యానంలో సిద్ధుడైనవాడు”
అంటే “దివ్యదృష్టి కలవాడు”
“కర్మలు” అంటే నిత్య నైమిత్తిక, కర్మలు
కనుక, కృష్ణుడి దృష్టిలో రకరకాల కర్మల కన్నా, శుష్కవేదాంత జ్ఞానం కన్నా,
ఉపవాసాది కఠిన చర్యల కన్నా, ధ్యానయోగమే మహాగొప్పది
- ఒకానొక యోగీశ్వరుడు అందరినీ ఏమని ఆదేశిస్తాడు? “బాబూ, నువ్వు కూడా యోగివి కా” అని … మరి చేద్దామా మనమూ ధ్యానం ? అవుదామా మనమూ యోగులం ?..