తాపత్రయం

 

“తాపం” అంటే దుఃఖం; “త్రయం” అంటే మూడు

త్రివిధ దుఃఖాలనే “తాపత్రయం” అంటారు;

తాపాలు అన్నవి మూడు రకాలుగా ఉంటాయి;

  1. ఆధ్యాత్మిక తాపం:
    మనలోని కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనబడే

    అరిషడ్వర్గాల వలన మనకు కలిగే బాధలనే “ఆధ్యాత్మిక తాపాలు” అంటాం;
    ప్రతి మనిషికీ ఉండే ఇహలోక బాధల మొత్తంలో 
    నిజానికి 90% ఈ విధంగా ఎవరికి వారు కల్పించుకున్న,
    మరి మనకు మనం కల్పించుకుంటూన్న బాధలే.
  2. ఆదిభౌతిక తాపం:
    ఇతర ప్రాణికోటి వలన కలిగే తాపాలను “ఆదిభౌతిక తాపాలు” అంటాం.

    మన ప్రమేయం లేకుండా ఇతరుల అజ్ఞాన, అక్రమ చర్యల వలన
    మనకు కలిగే భౌతికపరమైన బాధలు అన్నమాట;
    ప్రతి మనిషికి 9% ఇహలోక బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.
  3. ఆదిదైవిక తాపం:
    ప్రకృతి సహజమైన మార్పుల వలన కలిగే తాపాలను

    “ఆదిదైవిక తాపాలు” అంటాం . . 
    ఉదాహరణకు: అతివృష్టి, అనావృష్టి, అతిశీతలం, అతిఉష్ణం మొదలైనవి
    అనేక బాధలను కలిగిస్తూ ఉంటాయి;
    ప్రతి మనిషికి 1% ఇహలోక బాధలు మాత్రమే ఈ కోవకు చెందినవి.
  • మానవులందరికీ త్రివిధ దుఃఖాలు, తాపత్రయాలు ఉంటాయి.
  • ఒకానొక ముక్తపురుషుడికి, ఒకానొక ధ్యానయోగికి, ఆధ్యాత్మిక తాపాలు ఉండవు; కేవలం ఆదిభౌతిక, ఆదిదైవిక తాపాలు మత్రమే ఉంటాయి.