తీర్థంకర గోత్ర బంధం
“తీర్థంకరుడు” అంటే “తీర్థం గ్రోలినవాడు”
“తీర్థంకరుడు” అంటే “ధ్యానతీర్థం గ్రోలినవాడు”
“తీర్థంకరుడు” అయినవాడు “ఆధ్యాత్మిక అధ్యాపకుడు” అవుతాడు
“గోత్రం” అంటే “కోవ” అన్నమాట
కనుక, “తీర్థంకర గోత్ర బంధం” అంటే,
“ఆధ్యాత్మిక ఆధ్యాపకులకు సంబందించిన బంధం” అన్నమాట
ఆధ్యాత్మికం అంతా నేర్చుకున్న తరువాత, చివరిగా, ఇతరులకు, దానినే, నేర్పించడానికి మళ్ళీ పుడతాం అంటే, మనం స్వయంగా ముక్తపురుషులమైనా, ముక్తి గురించి ఇతరులకు నేర్పించవలసిన ధర్మం, కర్తవ్యం అన్నవి ఇంకా మిగిలే ఉంటాయి. .
అదే “తీర్థంకర గోత్ర బంధం”
ప్రతి యోగీ
తాను సిద్ధపురుషుడు అయిన తరువాత మిగిలిన వారిని కూడా సిద్ధపురుషులుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుంటాడు
అలా కొందరినైనా సిద్ధపురుషులుగా తయారు చేయగలిగినప్పుడు, “తీర్థంకర గోత్ర బంధం” నుంచి విముక్తుడయ్యాడన్నమాట
- తీర్థంకర గోత్ర బంధం నుంచి కూడా విడివడినప్పుడే సంపూర్ణంగా జన్మరాహిత్య పదవి సిద్ధిస్తుంది; ఇంక తిరిగి ఈ భూలోకంలోకి సాధారణంగా రానవసరం వుండదు