త్రిరత్నాలు

 

సత్యం అన్నది మూడు రత్నాలుగా భాసిస్తోంది.

ఇవే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారి త్రి రత్నాలు.

(1) ధ్యానం (2) స్వాధ్యాయం (3) సజ్జన సాంగత్యం

ఈ మూడు రత్నాలే ఆత్మను శోభాయమానంగా అలంకరింప జేసేవి.

ఈ మూడు రత్నాలే మానవుడిని శాశ్వతంగా అలంకరింప జేసేవి.

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస … ఫలం – ఆత్మానుభవం.

స్వాధ్యాయం అంటే మహామహుల జీవిత చరిత్రల్లోకి వెళ్ళటం …

ఫలం – విశేషమైన జ్ఞానలాభం.

సజ్జన సాంగత్యం అంటే యోగుల

అనుభవాలను వారి ముఖతః వినడం …

… ఫలం – అపారమైన మిత్రలాభం.

పిరమిడ్ స్పిరిచ్యువల్ మాస్టర్ల యొక్క భూషణాలే ఈ త్రి రత్నాలు.

ప్రపంచంలో జనులందరూ ఇదే విధంగా త్రిరత్న శోభితులవ్వాలి.

శుద్ధమైన ఆత్మానుభవంతో, అపారమైన ఆత్మవిజ్ఞానంతో, మరి మిత్రకోటి లాభంతో

సర్వజనులూ మహా ఆనందంగా జీవించాలి.

ధ్యానం శరణం గచ్ఛామి.

స్వాధ్యాయం శరణం గచ్ఛామి.

సజ్జనసంగం శరణం గచ్ఛామి…