మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది
అనారోగ్యం విపరీతంగా ప్రబలి, కనీస ఆరోగ్యం కోసం అర్రులు చాచి ఉన్న వర్తమాన సమాజానికి .. సంపూర్ణ అరోగ్యశాస్త్రం యొక్క విలువను తెలియజేసి వారికి సంపూర్ణ ఆనందాన్ని కల్పించటానికి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క “ధ్యాన ఆరోగ్య విధానం” నిర్దేశింపబడి వుంది!
వాస్తవానికి సకల రోగాలకు కూడా మన అడ్డదిడ్డమైన, అశాస్త్రీయమైన తిండి విధానాలు .. మన అడ్డదిడ్డమైన, అశాస్త్రీయమైన తిండి విధానాలు .. మన అడ్డదిడ్డమైన, అశాస్త్రీయమైన ఆలోచనా విధానాలు .. మాత్రమే కారణం. వీటన్నింటినీ నిరంతర ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలతో రూపుమాపి .. అనారోగ్యాన్ని శాశ్వతంగా నిర్మూలించడం పై సరియైన అవగాహన కల్పించటమే “ధ్యాన ఆరోగ్య విధానం” యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
దీర్ఘకాలిక రోగాలైన రక్తపోటు, మధుమేహం, నడుము నొప్పి, తలనొప్పి, నరాల సంబంధిత వ్యాధులకూ మరి మానసిక వ్యాధులకు ఏ ఆల్లోపతి మందులు వాడనవసరం లేకుండానే ఎవరికి వారే ధ్యానం ద్వారా వచ్చే విశ్వశక్తితో తమ నాడీమండలాన్ని శుద్ధి చేసుకుంటూ సంపూర్ణంగా స్వీయ చికిత్స చేసుకోగలుగుతారు.
“మానవుడు ఏడు శరీరాల సముదాయం అని శాస్త్రం తెలియజేస్తోంది”
అన్నమయకోశం… Physical Body
ప్రాణమయకోశం.. Etheric Body
మనోమయకోశం.. Astral Body
విజ్ఞానమయకోశం..Causal Body
ఆనందమయకోశం.. Spiritual Body
విశ్వమయకోశం… Cosmic Body
నిర్వాణమయకోశం..Nirvanic Body
ప్రాణమయకోశంలో విస్తరించి వున్న సుమారు 2,72,000 నాడుల సముదాయాన్నే “నాడీ మండలం” అంటాము. ఈ ప్రాణమయకోశంలోని నాడుల ద్వారానే భౌతిక శరీరానికి కావలసిన విశ్వమయప్రాణశక్తి సరఫరా అవుతూ వుంటుంది.
ప్రతి ఊరికి కొన్ని ముఖ్యమైన “రహదారి కూడళ్ళు” వున్నట్లే నాడీ మండలంలో వున్న 2,72,000 నాడులు కూడా కొన్ని కొన్ని ముఖ్య ప్రదేశాలలో అనుసంధానం అయ్యి అత్యంత ప్రధానంగా వుంటాయి. ఈ ముఖ్యప్రదేశాలనే “షట్చక్రాలు” అంటాం.
1. మూలాధార
2. స్వాధిష్టాన
3. మణిపూరక
4. అనాహత
5. విశుద్ధ
6. ఆజ్ఞ
ఈ చక్రాలన్నీ అన్నమయకోశంలోని గుదస్థానం మొదలుకుని తల వరకు .. వెన్నెముకకు సమాంతరంగా.. ప్రాణమయకోశంలో అమర్చి వుంటాయి. వీటన్నింటినీ దాటిన తరువాత వున్న “సహస్రారం” అన్న “చక్రాతీతస్థితి” కుండలినీలోని చివరి స్థితి.
“నాడీమండల అశుద్ధి”
ఒక్కొక్కసారి ప్రాణమయశరీరంలోని నాడులు .. పూర్వపు పాపకర్మలవల్ల మరి వర్తమానపు అశాస్త్రీయ జీవన విధానం వల్ల అపరిశుద్ధంగా వుండి నాడీమండలంలో ప్రాణశక్తిని సరిగ్గా సరఫరా కానీయకుండా అడ్డుకుంటూ సకల రోగాలకు కారకాలవుతూ వుంటాయి. “పాపకర్మలు” అంటే “మాంసాహారం తీసుకోవటం”.. “జీవిత న్యాయానికి వ్యతిరేకంగా హింసాత్మక కార్యకలాపాలు సాగించటం” మొదలైనవి. హింసాత్మకమైన మార్గాలు ఎప్పుడు ఇతరులకూ మరి మనకు కూడా ఇబ్బంది కారకాలుగా అవుతాయి.
మనం ఆధ్యాత్మికశాస్త్రం యొక్క మౌలిక సత్యాలను తెలుసుకోకుండా కేవలం ప్రాపంచిక జ్ఞానంతో .. దేహాన్నీ, మనస్సునూ మాత్రమే లెక్కించుకుంటే అది .. సర్వ అనారోగ్యాలకూ మూలహేతువు అవుతుంది. ఇలాంటి అజ్ఞానం వల్లనే నాడీమండలం లోని ప్రాణశక్తి నాళాలలో “అవరోధాలు” అంటే “blocks” ఏర్పడుతాయి.
దీని వలన ప్రాణమయకోశంలోని ఆయా ప్రాంతాలలో ప్రాణశక్తి క్షీణించి అవి ఇతర ప్రాణి సమూహాలయిన బ్యాక్టీరియా, వైరస్లకు నిలయమై .. వాటి వలన అనేక వ్యాధులు, మరి పీడలు కలుగుతాయి. క్రమక్రమంగా దేహం మొత్తం సకల వ్యాధులకు నిలయమై “దేవాలయం” గా వుండవలసిన మన దేహం “రోగాలయం” గా మారుతుంది. నాడీమండలంలో ఉన్న ఈ అశుద్ధిని తొలిగించకుండా పైపైన ఎన్ని మందులు వాడినా, మరి ఎన్ని ఇతర వైద్య విధానాలకు ఈ భౌతిక శరీరాన్ని గురి చేసినా కూడా .. అదంతా “తాత్కాలిక ఉపశమనమే” తప్ప “శాశ్వత చికిత్స” కానే కాదు.
“నాడీమండలశుద్ధి”
మనం నిద్రించే సమయంలో మన ప్రాణమయకోశం విశ్వం విశ్వశక్తిని నుంచి గ్రహిస్తూ వుంటుంది. అందుకే మనం రోజువారీ పనులతో ఎంత అలసిపోయినా కూడా .. కాస్సేపు నిద్రపోయి లేవగానే మళ్ళీ మనకు శక్తి వచ్చినట్లు తాజాగా అనిపిస్తుంది. నిద్ర సరిగ్గా రాకపోతే శరీరం శక్తిహీనంగా వుంటుంది. అయితే, రోగాలను పూర్తిగా నయం చేసే శక్తి మాత్రం మనకు నిద్రవల్ల లభించదు. అది ఒక్క ధ్యానంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ధ్యానంలోని ఆలోచనా రహితమైన స్థితిలోనే అనలోకి మరింత ఎక్కువగా కాస్మిక్ ఎనర్జీ ప్రవహించి ప్రాణమయకోశం మరింత తేజోవంతంగా తయారవుతుంది.
ధ్యానస్థితిలో.. ఒక ప్రక్క “ఆత్మశక్తి యొక్కఖర్చు” తగ్గుతూ .. మరొక ప్రక్క “విశ్వమయప్రాణశక్తి యొక్క జమ” పెరుగుతూ వుంటుదన్న మాట. ఏకకాలంలో జరిగే ఈ రెండింటి సంఘటనల వల్ల ప్రాణమయకోశంలోని “పూర్వపు పాపకర్మజనిత రోగ కారణాలు” అంటే “మలిన నాడులు” అన్నవి మూలాలతోసహా శుభ్రపరచబడతాయి.
“ధ్యాన స్థితిలో నొప్పులు”
ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల “నొప్పులు” రావచ్చు. ఆ నొప్పులు ధ్యానానికి ముందు మరి ధ్యానం ముగించిన తరువాత కూడా ఉండవు; ధ్యానం చేసినప్పుడు మాత్రమే వస్తాయి. అలా ధ్యానంలో మాత్రమే ఎక్కువ నొప్పులు వస్తున్నాయంటే .. అక్కడి ప్రాణమయకోశంలోని నాడీమండలం శుభ్రపడుతూ .. “రోగ కారణం” అన్నది అక్కడ శాశ్వతంగా నివారణ అవుతూన్నదని అర్థం. రెండు మూడు రోజులు ధ్యానం చేసిన తర్వాత ఇక అక్కడ నొప్పి రాదు. అయితే వేరే చోట్ల నొప్పి వస్తే రావచ్చు. ఈ విధంగా క్రమక్రమంగా వివిధ భౌతిక శరీర భాగాలన్నీ ఒక దాని తర్వాత ఒకటి పూర్తిగా శుభ్రపడినప్పుడు ఇక ఎప్పటికీ “రోగం” అన్న ప్రసక్తే ఉండదు. ఈ నొప్పులు ధ్యానంలో వున్నంతసేపు మాత్రమే వుంటాయి కనుక మనం భయపడి డాక్టర్ల దగ్గరకు వెళ్ళకూడదు.. మరి వాటికోసం ఎటువంటి మందులు కూడా వాడకూడదు.
మన భౌతిక శరీరంలోంచి విశ్వమయప్రాణశక్తి ప్రధానంగా బయటకు ప్రసారమయ్యే ద్వారాలు.. రెండు కళ్ళు, రెండు చేతులు వ్రేళ్ళ చివరలు, రెండు పాదాల వ్రేళ్ళ చివరలు. కనుకనే ధ్యానంలో కళ్ళు మూసి ఉండడం, వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టడం, కాళ్ళు రెండూ ‘క్రాస్’ చేసి ఉంచడం జరుగుతుంది. తద్వారా శరీరంలోని విశ్వమయప్రాణశక్తి శరీరంలోనే భద్రపరచబడి ఉంటుంది.
నాడీమండలశుద్ధీ సంపూర్ణంగా పూర్తి అయిన తరువాత “దివ్యచక్షువు” అంటే “ఆజ్ఞాచక్రం” యొక్క ఉత్తేజితం కూడా ప్రకృతి సహజంగానే జరుగుతుంది.
“రోగుల సమస్యలు-ధ్యానశాస్త్రజ్ఞుల కర్తవ్యాలు”
“సమస్యలు అనేవి రోగులు ఎవరికివారే సృష్టించుకున్నవి” అనే విషయాన్ని రోగులకు తెలియజేయడం.
“సమస్యలు కేవలం స్వీయచర్యల వలన మాత్రమే పరిష్కరింపబడతాయి; ఇతరులపై ఆధారపడటమనేది సమస్యలను మరింత జటిలం చేసుకోవడమే” అని రోగులకు తెలియజేయడం.
చెడు కర్మలను దగ్ధం చేసుకోవడంలో శాకాహారం యొక్క మౌలిక పాత్రను ప్రజలకు విస్తారంగా తెలియజేయడం.
సంపూర్ణ ఆరోగ్యం సమాకూరడానికి పిరమిడ్ అద్భుత శక్తి, మరి పిరమిడ్ ధ్యానం యొక్క ప్రముఖ పాత్రను గురించి రోగులను చైతన్యవంతులుగా చేయడం.
రోగులు తమతమ వ్యాధులను తామే స్వంతంగా రూపుమాపడానికి చేసే ప్రయత్నాలలో.. ధ్యానశాస్త్రజ్ఞులు వారికి మానసిక ప్రోత్సాహాన్ని అందించగలరు.
“రోగులకు వుండవలసిన అవగాహనలు”
“మనం సామాన్యులం కాము. మనలో అనంతమైన శక్తి-సామర్థ్యాలు నిబిడీకృతమై వున్నాయి. వాటిని నిత్యజీవితంలో సక్రమంగా వినియోగించుకోవాలి” అని రోగులు అందరూ గుర్తుంచుకోవాలి!
దేహం పట్ల మూఢ నమ్మకాలనూ, మరి తప్పుడు విశ్వాసాలనూ రోగులు సంపూర్ణంగా వదిలించుకోవాలి. “దేహం యొక్క శక్తి అనంతం! దేహాన్ని కంపు చేయకుండా వదిలేస్తే ఆ దేహం తనకు తానుగా ఆరోగ్యంగా వుంటూ మనకు కూడా ఎంతైనా ఇవ్వగలదు!” అని సదా స్ఫురణలో వుంచుకోవాలి.
ఆరోగ్యం రావడానికీ, మరి రోగం పోగొట్టుకోవడానికీ తానే బాధ్యుడనని ప్రతి రోగి కూడా గుర్తించాలి.
ప్రతి రోగి కూడా తనలోని స్వంత వైద్యుడిని మేల్కొల్పగలగాలి.
“పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే! ఆరోగ్యం అనేది బయటి వారెవరో ప్రసాదించే భిక్ష కాదు; అది ఎవరికి వారు సమర్పించుకునే అమూల్య కానుక”.. అన్నది ప్రతి రోగి కూడా తప్పక ఎరుకలో వుంచుకోవాలి.
“పాటించవలసిన ఆరోగ్య చిట్కాలు”
పుణ్య కార్యక్రమాలు సదా చేపడుతూ వుండాలి.
“మాంసాహారాన్ని, గ్రుడ్లతో సహా..పూర్తిగా త్యజించాలి!
శాకాహారిగా మారి క్రమక్రమంగా‘ఫలహారి’ గా రూపుదాల్చాలి!
అందులోనూ పరిమితాహారం చాలా శ్రేష్ఠం!
ప్రకృతితో సదా సాన్నిహిత్యం కలిగివుండాలి! అంటే అడవుల్లో, కొండల్లో, కోనల్లో, సముద్రతీరాల్లో అప్పుడప్పుడు విహరిస్తూండాలి.
నిరంతరం సృజనాత్మక కార్యకలాపాలు..అంటే క్రొత్త క్రొత్త ఆటలు, పాటలు మొదలైనవి చేపడుతూ వుండాలి; జీవితం అంటే ఒక పండుగలాగా గడపాలి; ముఖ్యంగా అన్ని రకాల వైరాగ్యభావనలకూ దూరంగా వుండాలి.
ఆహ్లాదం, ఉల్లాసం, చమత్కారం, హాస్యం..మొదలైన వాటిలో ఎప్పుడూ మునిగి తేలుతూండాలి.
పనికి మాలిన మాటలు మాట్లాడటం, వినటం సంపూర్ణంగా మానివేయాలి.