మహదవధానం
“మహత్” అంటే గొప్ప;
“అవధానం” అంటే “చదువు”,
కనుక “మహదవధానం” అంటే
“అన్నిటికన్నా గొప్ప చదువు” అన్నమాట.
శంకరాచార్యుల వారి భజగోవిందంలోని ఒక శ్లోకం :
“ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం –
జాప్యసమేత సమాధి విధానం – కుర్వవధానం మహదవధానం”
“ప్రాణాయామం” అంటే, “ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం”
“ప్రత్యాహారం” అంటే, “బహిరేంద్రియాలు అంతర్ముఖం చేయడం;
తద్వారా అంతరేంద్రియం ఉత్తేజితం కావడం”
“నిత్యానిత్య వివేక విచారం” అంటే, “ఏది సత్యం? ఏది అనిత్యం?”
అనేది స్పష్టంగా తెలుసుకోవడం”
“జపం” అంటే “అభ్యాసం”, “తిరిగి తిరిగి అదే పనిని చేయడం” అన్నమాట
‘జాప్యసమేత’ అంటే, ‘జపంతో కూడుకుని వున్న’
“జాప్యసమేత సమాధి విధానం” అంటే,
“ప్రాణాయామం; ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం –
అనే మూడింటినీ ఎప్పటికప్పుడు, మళ్ళీ మళ్ళీ విధిగా అభ్యాసం చేస్తూ వుండటం” అన్నమాట
అదే “సమాధి విధానం”, అంటే ‘సమాధి స్థితికి దారి’,
- “కురు అవధానం” అంటే “ఈ చదువు చదువు ” అని
- యోగవిద్యయే, బ్రహ్మవిద్యయే అన్నింటికన్నా ‘గొప్ప చదువు‘, అంటే ‘మహదవధానం’