మహమ్మద్
“మిమ్మల్ని భూమి నుంచి మొక్కల్లాగా పైకి
రావాలి అని అల్లా చేసాడు;
ఇక మీదట మళ్ళీ మిమ్మల్ని భూమిలోకి పంపుతాడు;
క్రొత్తగా మరోసారి పైకి తీసుకువస్తాడు”
[ఖురాన్ – సురా:71:17-18]
మనం ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ రావాల్సి వుంటుంది” –
అనే పునర్జన్మ సిద్ధాంతమే దీని అంతరార్థం.
మహమ్మద్ మక్కా పట్టణం సమీపంలో వున్న
“హీరా” అనబడే కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు;
అప్పుడు “గాబ్రియేల్” అనే ఆస్ట్రల్ మాస్టర్ ద్వారా
యోగసిద్ధి పొంది, అన్ని లోకాలను దర్శించి,
సత్యాన్నంతటినీ ప్రత్యక్షంగా పరిశోధించినవాడు.
విగ్రహారాధనలను తుదముట్టించినవాడు.
- మహమ్మద్ ఓ మహాసంస్కర్త, ఓ మహాప్రవక్త
- ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన లాగా నిర్గుణ పరబ్రహ్మ పరాయణులవడమే మన లక్ష్యం.