మహావాక్యాలు

 

 

ఈ క్రింది ఉపనిషత్ వాక్యాలను “మహావాక్యాలు” అంటాం:

1. “ప్రజ్ఞానం బ్రహ్మ”

ప్రజ్ఞానం అంటే పరిపూర్ణ జ్ఞానం;

మూలచైతన్య అవగాహనే పరిపూర్ణ జ్ఞానం

ప్రజ్ఞానమే ‘బ్రహ్మ’ అనబడుతుంది

2. “అహం బ్రహ్మాస్మి”

‘నేను’ అనే పదార్థమే ఆ ప్రజ్ఞానం;

‘నేను’ అన్నదే ఆ మూలచైతన్యం, ఆ విశ్వాత్మ, ఆ ‘బ్రహ్మ’

3. “అయం ఆత్మా బ్రహ్మ”

ఈ నా ఆత్మే ఆ ‘విశ్వాత్మ’ అయి వుంది

4. “తత్వమసి”

‘నువ్వు’ కూడా అదే, ఆ విశ్వాత్మే, ఆ ప్రజ్ఞానమే.

5. “సర్వం ఖల్విదం బ్రహ్మ”

ఈ ఉన్నదంతా ఆ విశ్వాత్మమయమే –

ఆ ప్రజ్ఞానమే – ఆ బ్రహ్మమే.

  • ద్రష్టలైన ఋషులు తమ ధ్యాననిష్టలో తాము తెలుసుకున్న  అనుభవాలన్నింటినీ క్రోడీకరించి అర్థం చేసుకుని చెప్పిన అఖండ సత్య సూత్రాలివి