మాంస పిండం మంత్ర పిండం

 

కర్నూలు స్వామీజీ, శ్రీ సదానంద యోగి ఎప్పుడూ అంటూ వుండేవారు –

“సుభాష్ , . . మాంస పిండాన్ని మంత్ర పిండంగా చేయాలోయో : ” అని

‘మాంస పిండం’ అంటే ‘అన్నమయకోశం’ దీనినే ‘మంత్ర పిండం’ గా అంటే ‘ప్రాణమయ కోశం’ లా చేసుకోవాలి అంటే, ‘ఎనర్జీ బాడీ’ గా అన్నమాట

ఇదే యోగ పరాకాష్ఠ ‘ఖండ యోగం’ లాంటి క్రియలు అప్పుడే సాధ్యం ; అలాంటి క్రియలు సదానంద యోగి తాను స్వయంగా సాధించి చెప్పినవారు షిర్డీసాయి కూడా మనకు అలాగే చేసి చూపించారు మహాయోగి శ్రీ కాశిరెడ్డి నాయన కూడా ఈ ‘ఖండ యోగం’ కోవకు చెందినవాడే

* “డాన్ యువాన్” జట్టుకు చెందిన గురువులు, వారి శిష్యులు అందరూ సాధించింది ఇదే ; ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే కార్లోస్ కాస్టానెడా పుస్తకాలు చదివితీరాలి

సృష్టిలోని మహాయోగులందరూ తమ తమ మాంసపిండాలను . . అంటే భౌతికకాయాలను మంత్రపిండాలుగా చేసుకున్నవారే