మాయ

 

“మాయ”
అనే పదానికి నిర్వచనం
“యా మా, సా మాయా”
“యా” = ఏదైతే .. “మా” = లేదో
“సా” = అది(దానిని) “మాయా” = మాయ (అని అంటారు)
అంటే
“ఏదైతే లేదో”, అంటే “దేనికైతే అస్తికత లేదో”
దానికి “మాయ” అని పేరు
నిజానికి
ప్రపంచంలో రెండే రెండు వస్తువులు “మాయ”
ఒకటి – “చావు” అనే భావన
రెండు – “నేను వేరే, నువ్వు వేరే” అనే భావన

“చావు” అన్నది అసలు ఎక్కడా లేదు !
ఉన్నదల్లా ఆది, అంతం లేని రూపాంతరీకరణ పరిణామక్రమమే !
“ఎక్కడా చావు లేదు ” అని తెలుసుకున్నవాడే
‘మాయ’ లోంచి బయటపడినవాడు
అలాగే “అహం బ్రహ్మాస్మి” .. “తత్వమసి”
అంటే, “నేనూ అదే నువ్వూ అదే” ..
“మమాత్మా సర్వభూతాత్మా” అని తెలుసుకున్నవాడే
‘మాయ’ లోంచి బయటపడినవాడు !
“దేహాత్మ భ్రాంతి” ఉన్నవాడే “మాయ” లో చిక్కినవాడు
“ఆత్మ దేహం” అన్న జ్ఞానం ఉన్నవాడే “మాయ” లేనివాడు

* ధ్యానం ద్వారానే దేహాత్మ భ్రాంతి తొలగుతుంది
* ధ్యానం ద్వారానే ” మమాత్మా సర్వభూతాత్మా ” అని తెలుసుకుంటాం