మార్పుకు హారతి – ధ్యానానికి హారతి

 

మార్పుకు హారతి

ప్రగతికి హారతి

మార్పు అంటే ప్రగతి

మార్పు ప్రకృతి తత్వం

జీవుడు ఒక పరమ ప్రకృతి

అనుభవాల పరంపరే జీవుడు

ప్రతి అనుభవమూ అమూల్యమే

ప్రతి అనుభవమూ అద్వితీయమే

ప్రతి అనుభవమూ ఒకానొక క్రొత్త ముందడుగే

ప్రతి అనుభవమూ ఒకానొక క్రొత్త ప్రగతి మెట్టే

మార్పుకు హారతి

ధ్యానానికి హారతి

ధ్యానానుభవాలకు హారతి

ధ్యానం ఒక మహా పెనుమార్పు

జీవుడి మూలాలను కదిలించేసే మార్పు

పెనుమార్పుకు మహాహారతి

ధ్యానం ప్రకృతికి ఆత్మను ప్రసాదిస్తుంది.

ఆత్మానుభవానికి హారతి

బ్రహ్మాత్మానుభవానికి పెనుహారతి

బ్రహ్మాత్మానుభవం జీవుడిని పరమపురుషుడిగా చేస్తుంది

బ్రహ్మాత్మానుభవం పురుషుడిని పురుషోత్తముడిగా చేస్తుంది

మార్పుకుహారతి

ధ్యానానికి హారతి

ధ్యానం ద్వారా ఆత్మానుభవం – ధ్యానం ద్వారా ఆనందమయ జీవితం