మెడిటేషన్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్
“మెడిటేషన్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్”
ప్రైమరీ స్థాయి | – | ధ్యానం చేస్తూంటాం ; మనస్సు అప్పుడప్పుడు చలిస్తుంది. |
మిడిల్ స్థాయి | – | రెండు గంటలు ధ్యానంలో వున్నా మనస్సు చలించదు. |
హైస్కూలు స్థాయి | – | ధ్యానంలో అనేకానేక అనుభవాలు మూడవకన్ను తెరుచుకోవడం. |
కాలేజీ స్థాయి | – | మహార్షి, ముఖ్యమైన గతజన్మలు చూడడం. |
యూనివర్శిటీ స్థాయి | – | బ్రహ్మర్షి , అంతా తానేనని తెలుసుకోవడం. |
“‘శ్వాస’ లాభాలు అనంతం. ఒక సంగీత పరికరం ఉంది … కానీ, ఆ వ్యక్తికి సంగీతం రాదు. దానివలన ఏం ప్రయోజనం లేదు. ఒక మురళి వుంది. ఓ వ్యక్తికి సంగీత అనుభవం వుండి వుంటే అదే మురళితో అనేక సంగీత స్వరాలు, మధురమైన సంగీతం వినవచ్చును. అలానే ప్రత్రి మనిషి దగ్గర ఊపిరి/శ్వాస ఉంది … దానితో ఏకమైతే ఆ మనిషి క్రమక్రమంగా ధ్యాని, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షిగా తయారౌతాడు.
“సోక్రటీస్”, “జీసస్” మొదలైన మహాత్ములు లక్ష్యం చేరుకున్నారు కాబట్టి విషం ఇచ్చినా, రక్తం కారేటట్లు హింసించినా ఆనందంగా అనుభవించారు … కదా.