మెల్బోర్న్లో గ్యారీ ఛానెలింగ్ సందేశాలు
గ్యారీ తన పూర్ణాత్మ DZAR తో మళ్ళీ ఛానెలింగ్ చేయగా .. పత్రీజీ వారిని నాలుగు ప్రశ్నలు అడిగారు ..
పత్రీజీ : “భూమండలంలోని మూగజీవాలను చంపుతూ వుంటే నాకు బాధ కలుగుతోంది ; ఈ జంతువులను చంపడం ఎప్పుడు అంతం అవుతుంది ?”
DZAR : “మీలోని బ్రహ్మర్షిత్వం వల్ల మీరు సమస్త ప్రాణకోటితో ఏకత్వాన్ని పొందారు. కాబట్టే ఆ బాధను మీరు అనుభూతి చెందుతున్నారు. చంపేవారు, తినేవారు విడివిడిగా వున్నారు అంటే .. వారిలో సృష్టితో కూడిన ఏకత్వ భావను ఉండదు. చంపడం బాధే, అయినా వారు ఆ బాధను లెక్కచేయ్యడం లేదు అంటే .. వారికి విశ్వన్యాయసూత్రం అయిన ఏకత్వం గురించి తెలియదు. అది వారు తెలుసుకున్న రోజున జంతువులను చంపడం పూర్తిగా ఆగిపోతుంది. ధ్యానం ద్వారా మాత్రమే అందరిలో ఆ ‘ఏకత్వం’ కలుగుతుంది.”
పత్రీజీ : “పిరమిడ్ శక్తిని గురించి తెలియచేయండి”
DZAR : “మీరే ఓ పిరమిడ్; మీరే ఆ శక్తి; మీ శక్తే లేకపోతే పిరమిడ్లో ఎనర్జీ అన్నదే లేదు ; కేవలం అవి కట్టడాలు మాత్రమే.”
పత్రీజీ : “వంద సంవత్సరాల అనంతరం భూమండలం ఎలా ఉండబోతోంది ?”
DZAR : “ప్రస్తుతం వున్న ప్రకారం అయితే వంద సంవత్సరాల తర్వాత ఏమీ వుండదు. భూమాత మనుగడకోసం మనం ఇంకా ఎంతగానో శ్రమించాలి .. పాటు పడాలి. ఈ క్షణం నుంచే విశేషంగా శ్రమిస్తే రాబోయే యాభై సంవత్సరాల తరువాత ఎంత బాగుంటుందో మీరే చెప్పండి. మీకు తెలుసుగా .. ఇంకా ఇంకా ఎంతో శ్రమ చేయాలి.”
పత్రీజీ : “మీరు నేను ఎప్పుడు కలిసాం ?”
DZAR : ” ఎప్పుడైనా విడిపోతే కదా కలవడం గురించి మాట్లాడుకోవడం; మనం ఎప్పుడూ సదా కలిసేవున్నాం ; మీకు తెలుసు. “
పత్రీజీ : “ఆస్ట్రేలియా భూభాగం గురించి చెప్పండి ?”
DZAR : “మతం పేరుతో, జాతి పేరుతో విభజనల వల్ల మానవాళి తన ఏకత్వాన్ని కోల్పోయి ‘ దేశాలు ’ ఏర్పాడ్డాయి. అన్ని భూ భాగాలు సస్యాశ్యామలమైనవే. దేశాలమధ్య ఎల్లలను చెరిపివేస్తే .. భూమండలం అంతా కూడా వసుధైక కుటుంబంగా విలసిల్లుతుంది.”