లలాట లిఖితం
ఏదీ “లలాట లిఖితం” కాదు
మన స్వీయకర్మలే తిరిగి “కర్మఫలాలు” గా మారి
మనల్ని వరిస్తూ వుంటాయి;
అథవా శపిస్తూ వుంటాయి.
మన జీవిత విధాతలం మనమే
మన జీవిత నిర్మాణకర్తలం మనమే
మనం ఏది కావాలి అంటే అది చేయవచ్చు
మన జీవితం మన ఇష్టం
అంతా మన కోరిక, అంతా మన ఇష్టం.
భూతకాలాన్ని బట్టి వర్తమానం ఎప్పుడూ వుండదు,
వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తూ వుంటుంది,
ఇంకా చెప్పాలి అంటే భవిష్యత్తు వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది,
ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం
కానీ, ఉన్న సత్యం ఇదే.
మన జీవిత వాస్తవాలు మన ఆలోచనల పర్యవసానాలు.
మన జీవిత వాస్తవాలు మన వాక్కుల పర్యవసానాలు,
మన జీవిత వాస్తవాలు మన కర్మల పరిణామాలు
- గతం ఏమైనా “వర్తమానం ప్రస్తుతం మన చేతుల్లో వుంది”, కనుక, దాన్ని ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుంటూంటే చాలు.