లోబ్సాంగ్ రాంపా
శ్రీ లోబ్సాంగ్ రాంపా
1979లో నన్ను తట్టి లేపిన కారుణ్యమూర్తి.
20వశతాబ్దపు సాటిలేని గొప్ప టిబెట్ యోగి లోబ్సాంగ్ రాంపా.
20వశతాబ్దపు ఆధ్యాత్మికశాస్త్ర అధ్యాపకులలో అగ్రగణ్యుడు;
1983 లో దేహ విరమణ చేసినవాడు;
“యూ ఫరెవర్ – You Forever” అనే పుస్తకం
నా చేత చదివించి,
నా జీవిత లక్ష్యాన్ని నాకు ఎరుక పరచిన
నా ప్రధమ ప్రియతమ ఆధ్యాత్మిక పరోక్ష గురువు శ్రీ లోబ్సాంగ్ రాంపా.
సూక్ష్మశరీరయానం గురించీ,
దివ్యచక్షువు గురించీ,
ఆకాశిక్ రికార్డుల గురించీ,
మరణాంతర జీవితం గురించీ,
తన స్వానుభవాల సహాయంతో తిరుగులేని విధంగా వివరించిన మహాయోగేశ్వరుడు శ్రీ లోబ్సాంగ్ రాంపా.
- ఇరవై అద్భుత పుస్తకాల రచయిత
- ఇలాంటి పుస్తకాలన్నీ చదివితేనే మనకు ఆధ్యాత్మికశాస్త్రం సుపరిచయం అయ్యేది.