బ్రహ్మానంద స్థితి

 

 

సంసారిక జీవితం అధ్యాత్మిక ఉన్నతికి అవరోధం కాదు.

చిత్తవృత్తిని నిరోధం చేసినవాడే యోగి అవుతాడు. సత్యాన్ని ప్రదర్శించేవాడే ద్రష్ట అవుతాడు. స్వానుభవం ద్వారానే ఆత్మ సాక్షాత్కారం పొందుతాం. మానవులలో ఎవరైతే ధ్యానం చేసి దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుంటారో అతనే’ శివుడు ‘. మనస్సులోని ముక్తి మరొకచోట దొరకదు. స్నానం ద్వారా దేహశుద్ధి కలుగుతుంది; పానం ద్వార దాహం తీరుతుంది. మంత్రం ద్వారా ఉచ్చారణ సరిగ్గా వుండి వాక్కు పటిష్టం అవుతుంది. ధ్యానం ద్వారా దేవుడే దిగి వస్తాడు.

సహస్రార స్థితే బ్రహ్మానంద స్థితి. ధ్యానుల జీవిత లక్ష్యం సహస్రార స్థితిలో స్థితమవడం.

ఎలా అయితే ‘నేను భారతీయుడిని ‘అని చెప్పుకుంటామో ‘నేను దేవుడిని ‘ అని చెప్పుకునే స్థితికీ అందరూ రావాలి. త్రికరణ శుద్ధితో సాధన చేయడం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది.