“2020 శాకాహార జగత్”

 

భారతదేశం అహింసా దేశం

భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి శాకాహార దేశం అయితీరాలి

జంతు సామ్రాజ్యానికి ఇక పూర్ణ స్వాతంత్రం ఇద్దాం

జంతు సామ్రాజ్యాన్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వడమే నిజమైన మానవతా ధర్మం.

అన్య ప్రాణి పట్ల ఉపకారమే ‘ స్వ’ ఉపకారం

అన్య ప్రాణి పట్ల అపకారమే ‘ స్వ’ అపకారం

జంతువధ అన్నదే మానవాళి యొక్క మహాపాపకర్మ

జంతుమాంసభక్షణ అన్నదే సకల రోగాలకు మూలకారణం

ఒకానొక పులి ఒకానొక మేకను తింటుంది..

కనుక దానిని “క్రూరమృగం” అంటాం

ఒకానొక ఏనుగు సస్యాహారి..

కనుక దానిని “సాధుజంతువు” అంటాం

ఏనుగు క్రూరమృగమూ కాదు, పులి సాధుజంతువూ కాదు

‘క్రూర’ అనే పద ప్రయోగంలోనే కఠోరత్వం మరి కాఠిన్యం వున్నాయి

‘సాధు’ అనే పద ప్రయోగంలోనే మృదుత్వం మరి శాంత స్వభావం వున్నాయి

మనిషి కూడా కోళ్ళనూ, మేకలనూ తింటే తను కూడా క్రూరమృగమే.

మనిషి సస్యాహారి అయితే సాధు జంతువే.

మాంసం తినే మానవజాతి అంతా కూడానూ,

మాంసాహార మానవాళి అంతా కూడా, “ఆటవిక మానవాళి“.

“ద్విపాద క్రూరమృగ మనిషి జాతి“

సస్యాహార మానవాళి అంతా కూడా “సంస్కార మానవాళి” మరి “సాధు మానవాళి”.

సస్యాహార మానవులంతా “మానవత్వపు వెలుగులతో కూడిన మానవాళి”.

ఈ భూమి మీద మాంసాహారులందరూ ఇక శాకాహారులవుదురు గాక

ఈ భూమి మీద 2020 కల్లా “శాకాహార జగత్“ను స్థాపించి తీరుతాం.

జై శాకాహార జగత్ …

జై జై శాకాహార జగత్


“శాకాహారి కాకుండా ఎవ్వరూ ఆత్మజ్ఞాని కాలేరు”…

కనుక శాకాహారి కావడమనేది చాలా మౌలికమైన సూత్రం.

“గ్రుడ్లు శాకాహారమా? లేక మాంసాహారమా?” అని అడుగుతారు. మొక్కల నుంచి వచ్చేదైతే అది శాకాహారం, జంతువుల నుంచి వచ్చేదైతే అది మాంసాహారం. కనుక గ్రుడ్లు సుతరామూ పనికిరావు. గ్రుడ్లు సాంతమూ – మాంసాహారమే.

ఏ జంతువూ మానవుల కోసం పుట్టలేదు. ప్రతి జంతువూ తన కోసమే, తన స్వంత కళ్యాణం కోసమే పుడ్తుంది. దాని కళ్యాణాన్ని పరిరక్షించడమే మానవుడి యొక్క అసలైన బాధ్యత. మానవులు బుద్ధిమంతులైనప్పుడు మరి తమ చిన్నతమ్ముళ్ళైన … పక్షి సామ్రాజ్యాన్నీ, మత్స్య సామ్రాజ్యాన్నీ … జంతు సామ్రాజ్యాన్నీ పరిరక్షించడమే మానవ సామ్రాజ్యం యొక్క ప్రధాన కర్తవ్యం. అంతేకానీ జంతుసామ్రాజ్యాన్ని భక్షించడం తగదు.

కూరగాయలను, పళ్ళ మొక్కలను బాగా పెంచుతూ, శాకాహారాన్నే స్వీకరిస్తూ జంతువులను పరిరక్షిస్తూ, జంతువులతో ఆడుకుంటూ మరి ఆ విధంగా వుండడమే మానవాళి యొక్క సౌభాగ్యానికీ, కళ్యాణానికీ మూలకారణం అవుతుంది.

బ్రహ్మర్షి పత్రీజీ

 

అహింసా జగత్”

సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొని ఉండాలంటే, ప్రజలంతా ఆనందంగా జీవించాలంటే .. హింసా ప్రవృత్తి తొలగిపోవాలి. తోటి జీవులను హింసించడం, చంపడం మానుకోవాలి. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారడం వలన మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే మన ఆరోగ్యంతోపాటు పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శాకాహారిగా, అహింసావాదిగా మారితే .. ఇక అంతకంటే మంచి ఇంకోటి ఉండదు.

మొట్టమొదటి నుంచి సాంప్రదాయకమైన శాకాహార కుటుంబంలో పుట్టిన నాకంటే .. మాంసాహారులుగా వుండి కూడా ధ్యానం చేసి దీనివల్ల జరిగే అనర్థాలను తెలుసుకొని, వెంటనే ఆ పాపాహారం నుంచి బయటపడి శాకాహారుల్లా మారి .. ఇతరులు కూడా శాకాహారుల్లా మారడానికి ప్రచారాలు చేయడం .. నిజంగా అభినందనీయం.

శాకాహార జగత్ 2020లక్ష్యంగా చేసుకొని, అహర్నిశలు కృషి చేస్తూ, శాకాహార ర్యాలీలను నిర్వహిస్తూ, మాంసాహారులను సైతం శాకాహారులుగా మారుస్తూ, శాకాహార ప్రాముఖ్యతను ప్రపంచానికంతటికీ చాటిచెప్తున్న పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీకి మరియు పిరమిడ్ మాస్టర్స్‌కూ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ

మీ

కొణిజేటి రోశయ్య,

గవర్నర్, తమిళనాడు.


మహాత్మా గాంధీ

“గొర్రెప్రాణం విలువ మానవుని ప్రాణం కన్నా తక్కువ ఏమీ కాదు. మనిషి శరీరాన్ని పోషించుకోవడానికి గొర్రెను చంపడం ఎప్పటికీ అంగీకరించలేను. జంతువు చాలా నిస్సహాయమైన ప్రాణి. మానవుడి సహాయం పొందడానికి అది అధికారి. అయితే, దానికి సాయం చెయ్యాలంటే మనిషికి ఎంతో యోగ్యత, అధికార విచక్షణ వుండడం అవసరం.”

హింస ద్వారా హింస మాత్రమే పుడుతుంది; అహింసను ఆధారం చేసుకుని ప్రపంచంలోని ఏ క్రూరశక్తినయినా జయించవచ్చు.”

* * *

 

వీరబ్రహ్మేంద్రస్వామి

జీవులను వధించి జీవికి వేసిన

జీవ దోషములను జిక్కువడును:

జీవహింస చేత చిక్కునా మోక్షంబు?

కాళికాంబ ! హంస కాళికాంబ !”

* * *

 

యోగి వేమన

పక్షిజాతిని బట్టి పరగ హింసల బెట్టి

కుక్షినిండ కూడు కూరుటకును

వండి తినెడివాడు వసుధ ఛండాలుడు

విశ్వదాభిరామ వినురవేమ !”

* * *

 

జార్జి బెర్నార్డ్‌షా

మాంసాన్ని తినే మనము నడుస్తూ, తిరుగుతూ ఉన్న సమాధులం. వీటిలో మన జిహ్వ చాపల్యం కోసం చంపబడిన జంతువుల శవాలు పూడ్చిపెట్టబడ్డాయి.”

శవాల కుళ్ళు మాంసాన్ని పీక్కుతినే కాకుల వలె మనం మాంసం తింటూ జీవిస్తున్నాం. దీనివల్ల జీవులకు భయంకరమైన బాధ, కష్టం కలుగుతుందనే దాని గురించి మనకు చింతలేదు. మనము పట్టించుకోం. ఎంతటి దౌర్భాగ్యమో ..”

* * *

 

ఓషో రజనీష్

జంతువులు మన సహోదరులు. మీరు తినడానికి ఒక జంతువును చంపడం అనే ఆలోచనే అసహ్యకరమైనది. ఏ జంతువూ చంప బడకూడదు. భూమి మీద ఏ జంతువు అవసరం వున్నా అది జీవిస్తుంది. అలాగే ఏ జంతువు అవసరం భూమి మీద వుండదో దాన్ని చంపినా చంపకపోయినా భూమిమీద నుండి అది అదృశ్యమైపోతుంది.”

జంతువులు మానవులకు సోదరులు, తోబుట్టువులు. కారణం వారి నుండే మానవుడు వచ్చాడు. అది మన కుటుంబం. మానవుడిని చంపడమంటే ఎదిగిన జంతువును చంపడం. జంతువును చంపడమంటే ఎదుగుతున్న మానవుడిని చంపడం. రెండూ సమానమే. కారణం ఒకనాటి జంతువులే మనుష్యులుగా పరిణామం చెందుతున్నారు.”

* * *

 

తిరువల్లువర్

తన స్వంత మాంసాన్ని క్రొవ్వు పట్టేలా చేసేందుకు ఒక జంతువు మాంసాన్ని తినేవాడు నిజమైన కరుణను ఎలా అభ్యసించగలడు?”

ప్రజలంతా మాంసాన్ని కొనడం మరి వినియోగించడం చేయకపోతే కనుక జంతువులను వధించి మరి మాంసాన్నిఅమ్మకానికి ఉంచేవాళ్ళు ఎవ్వరూ ఉండరు.”

ఎవరు జంతువులను చంపడం మీదే జీవిస్తారో వారు చివరకు అనారోగ్యంతో దారిద్య్రంతో బాధపడటమే కాదు, అవమానాలకు కూడా గురవుతారు.”

* * *

 

కబీర్ దాస్

జంతువులను ఒక్క పెట్టున నరకడం, చాలాసేపు రక్తం కార్చుతూ చంపడం దోషపూరితం, అధమం మరి దయా రహితం. అలాంటివారు అంత్య సమయంలో శిక్ష అనుభవించవలసి వస్తుంది.”

కడుపు నిండా చేపల్ని తిని కోటి గోవులను దానమిచ్చినా .. నరకానికే వెళతారు. బాధ అనేది ఏ జీవికైనా ఒక్కటే, మూర్ఖులైన జనులు గ్రహించడంలేదు.”

* * *

 

స్వామి దయానంద సరస్వతి

మాంసం భుజించడం ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది. మాంసం తినేవారి, మత్తుపానీయాల్ని త్రాగేవారి శరీరాలు మరి వీర్యకణాలు కూడా కలుషితమవుతాయి.”

* * *

 

మైఖేల్ నేమి

ఎవరైతే జీవుల మాంసాన్ని చీల్చుతారో వారి మాంసం కూడా చీల్చబడుతుంది. ఎవరైతే ఎముకలను విరుస్తారో వారి ఎముకలు కూడా విరువబడతాయి. ప్రతీ రక్తపు బొట్టుకి తన రక్తపు బొట్టుతో లెక్కలు అప్పగించవలసిందేఇది తిరుగులేని న్యాయ సూత్రం.

* * *

 

మనుస్మృతి

జీవులను చంపేవారు, చంపించేవారు, అమ్మేవారు, వండేవారు, వడ్డించేవారు, మాంసం కోసేవారు, తినేవారు, తినిపించేవారు ఈ ఎనిమిది రకాల వారు హత్యలో భాగస్వాములే.”

* * *

 

ఇస్లాం

భూమిపై సంచరించు జంతువులు గానీ, ఆకాశంలో రెక్కలతో ఎగురు పక్షులు గానీ, సృష్టిలోని సమస్తమూ మీవంటివే.”

-7వ కాండ 38వ వాక్యం, ఖురాన్

అతడే పందిళ్ళపై నెక్కింపబడు తోటలను, పందిళ్ళగా మారని వృక్షములను సృష్టించెను. అలాగే ఖర్జూర వృక్షములను, పొలములను సృష్టించెను. వాని ఫలములు వేరువేరుగా నున్నవి. దానిమ్మను కూడా సృష్టించెను. ఒకదానికొకటి పోలికలు లేని ఫలములను సృష్టించెను. అవి ఫలించినప్పుడు వాటిని భుజింపుము. వృధాగా ఖర్చుచేయకుము. అటువంటి వారిని భగవంతుడు ప్రేమించడు.”

-8వ కాండ 142 వాక్యం, ఖురాన్

ఓ జనులారా ! భూమిలోని వస్తువులలో శాస్త్ర సమ్మతములై, పవిత్రములైన వాటిని భుజింపుము. ‘సైతాను’మార్గంలో నడువకుము. నిశ్చయముగా ‘సైతానుమీకు సుస్పష్టమైన శత్రువు. హింసాకార్యములను చేయు దిశగా మిమ్ములను ప్రేరేపించును. అసత్యములను పరమాత్మపై మోపుటకు మిమ్ములను ఆజ్ఞాపించును.”

-2వ సూరా 168వ వాక్యం, ఖురాన్

ఎవడు ఒక హత్య బదులుగా కాక భూమిలో ఉపద్రవమునకు గాక ఒక జీవిని చంపునో, అట్టివాడు సర్వజీవులను చంపినవాడగును. ఎవడు ఒక ఆత్మను బ్రతుకనిచ్చునో, వాడు సర్వ ఆత్మలను బ్రతుకనిచ్చిన వాడగును.”

-6వ కాండ 32వ వాక్యం, ఖురాన్

* * *

 

క్రైస్తవం

ఎడ్మండ్ జకై ప్రచురించిన గాస్పెల్ ఆఫ్ పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్అనే పుస్తకంలో ఏసుక్రీస్తు ప్రవచనాలను ఈ విధంగా వ్రాశారు:

ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమను తామే చంపుకుంటున్నారు. ఎవరైతే చంపబడిన జంతు మాంసాన్ని తింటారో వారు నిజానికి తమ మృత మాంసాన్ని తింటున్నారు. జంతువుల మృత్యువు వారి స్వీయ మృత్యువు. ఎందుకంటే ఈ పాపానికి ఫలితం అంటే శిక్ష మరణం కంటే తక్కువగా వుండజాలదు. ఎందుకంటే వాడి శరీరంలో ఆ జంతువుల రక్తం యొక్క ప్రతి చుక్కా విషంగా మారుతుంది. వాని శ్వాసలో మృత పశువుల శ్వాసల దుర్గంధముంటుంది. వాని రక్తం మృత పశువుల రక్తంలానే పొంగుతుంది .. మరి పశువుల మరణం వాని మరణం అవుతుందిఅని చెప్పారు.

మూగ జీవులను చంపకు. అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు. నీవు సైతాన్‌కు బానిస అవగలవు. ఎందుకంటే అది దుఃఖంతో కూడిన మార్గం. అది మృత్యువు వైపుకు తీసుకు వెళ్తుంది. పరమాత్మ ఆజ్ఞలో జీవించు, అలా జీవిస్తే ఆయన దూతలు జీవితపు మార్గంలో నీకు సహాయం చేస్తారు. అందువలన పరమాత్మ యొక్క ఈ ఆదేశాన్ని పాటించు. చూడు .. నేను నీకు భూమిపైన అనేక రకాల ఫలాలనూ, ధాన్యాలనూ ఇచ్చాను. ఫలాలు కాచే అనేక వృక్షాలను ఇచ్చాను. ఇవి నీకు మాంసానికి బదులుగా ఇవ్వబడ్డాయి. రక్తమాంసాలతో వున్న వాటిని నీవెన్నడూ తినకు.

– The Gospel of peace, Jesus p.48,49

* * *

 

జైన్ బోధనలు జీవించుజీవించనివ్వు

జైన మతంలో అయిదు మహావ్రతాల్లో మొదటిది మరి అత్యంత అవశ్యకమైన మహావ్రతం ‘అహింస’. ఏ జీవికీ ఏ రకమైన దుఃఖాన్నీ, కష్టాన్నీ కలిగించకుండటం, వాటిపై దయ, ప్రేమ చూపడమన్నది ముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. వారు దీనినే ‘మహావ్రతం’అంటారు.

జైన మతం ప్రకారం జంతువులను బంధించడం దుఃఖాన్ని కలిగించడం, కొట్టడం, వాటిపైన అధిక బరువు వేయడం కూడా మహాపాపంగా పరిగణించబడుతుంది.

* * *

 

బుద్ధుని బోధన

ప్రాణాలను ఎవరైనా తీయగలరు, కానీ ఎవరైనా ప్రాణాలను పోయగలరా? ఎంతటి నిమ్న జాతికి, అధమ జాతికి చెందిన వాటికి కూడా ప్రాణం ప్రియమైనదే .. ఎవ్వరూ తమ ప్రాణాలను అర్పించటానికి సిద్ధపడరు. మన మనస్సులో దయఅనే భావం వుంటే ఈ జీవితం అమూల్యమైనది. జనులు తాము స్వయంగా నిర్దయులై వుండి దేవతల నుంచి మాత్రం దయను అర్థిస్తారు. దేవతలకు, మానవులు, పశువులూ ఇద్దరూ సమానమే, సర్వ జీవులూ సమానమేనన్న జ్ఞానం ఎవరికి కలుగుతుందో వారే శ్రేష్ఠమైన మానవులు.”

* * *

 

ఆధ్యాత్మికత .. శాకాహారం

ఓ దివ్య శక్తులారా ! మా ద్విపాద మరి చతుష్పాద జీవజాతులు రెండింటినీ సంరక్షించండి. వాటి అవసరాలకు ఆహారాన్నీ మరి జలాన్నీ అందించండి. మాతో పాటు వాటి ఉన్నతి మరి దృఢత్వం కూడా వృద్ధి చెందుగాక!”

ఋగ్వేద సంహిత 10.37.11.VE,319

ఓరాజా ! .. మాంసపు భాగాన్ని పుచ్చుకునేవాడు, గుర్రపు మాంసం లేదా ఇతర జంతువు మాంసమైనా, మరి గోవులను వధించడం ద్వారా ఇతరులకు పాలు అందుబాటులో లేకుండా చేసే పాపిష్టివాడు దానిని మానుకొనకపోతే కనుక అలాంటప్పుడు అతనికి శిరచ్ఛేదం చేయడానికి నువ్వు సంశయించకూడదు.”

ఋగ్వేద సంహిత 1087.16,FS,90

ధ్యానాన్నీ మరి ఇతర యోగ మార్గాలనూ అవలంబించే ఉన్నతాత్మలు.. సకల జీవుల పట్ల ఎల్లవేళలా శ్రద్ధ వహించేవారు, జంతువులను సంరక్షించేవాళ్ళు, ఆధ్యాత్మిక అభ్యాసాల గురించి వాస్తవంగా శ్రద్ధ కలిగిన వ్యక్తులు.”

అధర్వణ వేద సంహిత 19.48.5.FS, 90

భగవంతుడిచే ప్రసాదించబడిన శరీరాన్ని భగవంతుడి యొక్క జీవులను చంపేందుకు వినియోగించకూడదు .. అది మనిషి అయినా, జంతువైనా లేదా మరేదైనా.”

యజుర్వేద సంహిత 12.32. FS,90

అసలైన ధర్మం తెలియని వాళ్ళు, దుర్మార్గులు మరి గర్వాంధులూ అయినప్పటికీ, తమను తాము నీతివంతులుగా పరిగణించుకుంటారు. ఏ విధమైన పశ్చాత్తాపభావం, కనికరం లేదా శిక్ష పట్ల భయం లేకుండా .. జంతువులను చంపుతారు. తరువాత అటువంటి పాపిష్టి వ్యక్తులు తమ తదుపరి జన్మలలో, తాము ఈ ప్రపంచంలో చంపిన జీవులకే ఆహారమవుతారు.”

శ్రీమద్భాగవతం 11.5.4

అసలు గోవులు పేరే అఘన్య’, ‘వాటిని ఎన్నడూ వధించకూడదుఅని అది సూచిస్తుంది. అలాంటప్పుడు వాటిని ఎవరు వధించగలరు? నిశ్చయంగానే, ఆవును లేదా ఎద్దును చంపేవాడు అత్యంత హేయమైన నేరాన్ని చేస్తున్నాడు.”

మహాభారతం, శాంతి పర్వం 262.47

ఇతర జీవుల మాంసాన్ని తినడం ద్వారా తన మాంసాన్ని వృద్ధి చేసుకోవాలని కోరుకునేవాడు ఏ జీవజాతిలో జన్మించినా దీనస్థితిలోనే జీవిస్తాడు.”

మహాభారతం అను 115.47

అహింసయే సర్వోన్నత ధర్మం. అహింసయే అత్యుత్తమ తపస్సు. అహింసయే ఉత్తమోత్తమ బహుమతి. అహింసయే అత్యున్నత ఆత్మ సంయమనం. అహింసయే అత్యుత్తమ మిత్రుడు. అహింసయే అత్యున్నత సత్యం. అహింసయే అత్యున్నత బోధన.”

మహాభారతం, 18,116.37-41

శ్లో|| ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున| సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః||

భగవద్గీత 6-32

ఓ అర్జునా ! ఎవడు సమస్త భూతకోటి యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తాడో అలాంటివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియుడు. ఇది నా నిశ్చితాభిప్రాయం.”

* * *