జై ధ్యానజగత్ – జైజై పిరమిడ్ మాస్టర్ల జగత్

 

 

“కార్యం వెనుక ఉన్నది కారణం”

కారణం వెనుక ఉన్నది మహాకారణం

మహాకారణం వెనుక ఉన్నది మహామహాకారణం

మహా మహా కారణాత్మకమైనదే .. “ఆత్మ-చైతన్య సామ్రాజ్యం”

ఆ ఆత్మ-చైతన్య సామ్రాజ్యంలో నిరంతరం ఓలలాడడమే .. “ఆధ్యాత్మికత”

ఆధ్యాత్మికత లేని ప్రాపంచికత .. చుక్కాని లేని నడిసముద్రపు నావ

ఆధ్యాత్మికతాశూన్యం అయిన ప్రాపంచికత అంతా అపసవ్యం .. అల్లకల్లోలం ..అగమ్యగోచరం

ఆధ్యాత్మికత తో కూడిన ప్రాపంచికత అంతా సవ్యం .. శాంతిమయం .. గమ్యగోచరం

“యద్భావం తద్భవతి”

శరీరం పుట్టడం, పెరగడం మరి అంతం కావడం అంతా కేవలం దృశ్యమానం

అంటే .. అది “తెర ముందర తోలుబొమ్మలాట” లాంటిది

తెరవెనుక ఉన్నది .. ఆడించేది మానసికం .. అదే మహాకారణం

మనస్సు మహాకారణం అయితే .. శరీరం అన్నది మహాకార్యం

మహాకారణమైన మనస్సులో ఉండే అల్లకల్లోలాలే .. ప్రపంచంలో ఉండే అల్లకల్లోలాలు

మహాకారణమైన మనస్సు శాంతం అయితే .. ప్రపంచం కూడా శాంతం అవుతుంది

“ప్రాపంచికం”.. “ఆధ్యాత్మికం”

పంచభూతాలతో కూడినది .. “భౌతికశరీరం”

పంచభూతాల వెనుక ఉన్న మౌలిక ప్రాణప్రవాహాలు “పంచతన్మాత్రలు”

పంచతన్మాత్రలు కారణభూతాలు అయితే పంచభూతాలు కార్యరూపాలు

“ప్రాపంచికత” -“ఆధ్యాత్మికత” .. ఈ రెండింటి మధ్య ఉండేదే మహాకారణమైన “మనస్సు”

మహాకారణ మనస్సు ప్రతీక.. “అర్జునుడు”

మహామహాకారణ బుద్ధికి ప్రతీక “శ్రీకృష్ణుడు”

మనస్సుకు సారధిగా ఉండేది “బుద్ధి” అంటే “శ్రీకృష్ణుడు”

“మనస్సు” అన్నది పంచేద్రియ విషయ జనీనమైనదీ అయితే

“బుద్ధి” అన్నది మాత్రం ఆత్మజనీనమైనది

ప్రాపంచికతకు దర్పణం పట్టేది మనస్సు .. ఆధ్యాత్మికతకు దర్పణం పట్టేది బుద్ధి

‘మనస్సు’ నుంచి ‘బుద్ధి’ వైపు .. మరి ‘ప్రాపంచికత’ నుంచి ‘ఆధ్యాత్మికత’ వైపు

చేసే మహా ప్రయాణమే “ఆధ్యాత్మికత”

మానవజీవితం = ప్రాపంచికత జీవితం + ఆధ్యాత్మిక జీవితం

ప్రాపంచికతలో ఉంటూనే ఆధ్యాత్మికతలో రాణించగలగాలి

ధ్యానసాధన ద్వారానే మేటి అయిన ఈ “ద్వి అశ్వారోహణ” అన్నది సుసాధ్యం అవుతుంది

ఇదే “రెండు గుర్రాల సవారీ” అంటే

“పద్మపత్రమివాంభస” అంటే “తామరాకు మీద నీటిబొట్టు”

“తామరాకు మీద నీటిబొట్టు” లాగా ఒకవైపు అశాశ్వత తత్వంలో నివసిస్తూనే .. మరోవైపు శాశ్వత తత్వంలో మనగలగాలి

ప్రాపంచికతలో సుఖ-దుఃఖాలు, గెలుపు-ఓటములు, మాన-అవమానాలు ప్రకృతి సహజం

అదేవిధంగా ఆధ్యాత్మికతలో నిరంతరానందం అన్నది మహాసహజం

లక్షాధికంగా ఉన్న “అద్వైతానుభవయోద్ధులు – పిరమిడ్ మాస్టర్లు” అందరూ మహా మహాధన్యులు

ఇక మిగిలిన కోట్లాది మానవులందరూ పిరమిడ్ మాస్టర్లు గా ఇంకొక దశాబ్ద కాలంలోనే అవనున్నారు!

“ధ్యానజగత్” కు ఆహ్వానం .. “పిరమిడ్ మాస్టర్ల జగత్” కు ఆహ్వానం

“14 రోజుల పాటు”

డిసెంబర్ 18 నుంచి 31 వరకు “కైలాసపురి” .. కడ్తాల్ గ్రామం, మహబూబ్‌నగర్ జిల్లాలో

జరగబోయే “ధ్యానమహాచక్రం -5 ధ్యానమహోత్సవాల” సందర్భంగా

అందరికీ ఇదే పిలుపు!

జై అహింసా జగత్! జై శాకాహర జగత్!! జై ధ్యానజగత్!!!