పిరమిడ్ స్పిరిచ్యువల్ సైన్స్ అకాడెమీ

 

 

మన యొక్క “ఉనికి-అస్తిత్వం” లో

“సరి అయిన తత్వం” ఉంటుంది .. “సరి కాని తత్వం” కూడా ఉంటుంది

మనతో చేయబడే “పనులు” అంటే

కొన్నిసరిఅయిన పద్ధతిలో వుంటాయి .. మరికొన్ని సరికాని పద్ధతిలో వుంటాయి

సరికాని ఉనికినీ, సరికాని పద్ధతులనూ వదిలేయాలి ..

సరి అయిన ఉనికినీ, సరిఅయిన పద్ధతులనూ అనుసరించాలి

అదే “దివ్యజ్ఞాన ప్రకాశం” అంటే

“ఏమిటి”? .. “ఎందుకు?” .. “ఎలా?” .. “ఎప్పుడు?” .. “ఎక్కడ?” అన్న తర్కంతో

జీవితంలోని అన్ని విషయాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి

“ఏది తప్పు?” .. “ఏది ఒప్పు?”

“ఎలా చెయ్యాలి?” .. “ఎలా చెయ్యకూడదు?”

“ఏది చెయ్యాలి?” .. “ఏది చెయ్యకూడదు”

“ఎందుకు చెయ్యాలి?” .. “ఎందుకు చెయ్యకూడదు?”

“ఎక్కడ చెయ్యాలి?” .. “ఎక్కడ చెయ్యకూడదు?”

వీటన్నింటి పట్ల ఆధ్యాత్మికపరమైన సత్య అవగాహనలు పొందాలి

ఈ సకల అవగాహనలూ .. “ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర అధ్యయనం” ద్వారానే

ఉద్భవిస్తాయి

స్కూళ్ళల్లో పిల్లల తమ విద్యార్థి దశనుంచే సరియైన జీవన విధానాన్ని

అలవరచుకుని

సరియైన ఉనికిలోవుంటూ, సరియైన పనులనే చేసేలా చూడాలంటే

ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్రాన్ని మన విద్యావ్యవస్థలో మౌలిక బోధనాంశంగా

పొందుపరచాలి

ఆధ్యాత్మిక విజ్ఞానశాస్త్ర మూల సిద్ధాంతాలతో కూర్చిన

బోధనాంశాలను ప్రతి ఒక్క పాఠశాలకూ చేరవేయడానికే

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్, బెంగళూరు, ద్వారా

“పిరమిడ్ స్పిరిచ్యువల్ సైన్స్ అకాడెమీ” ఆవిర్భవించింది

“శాస్త్రం” అన్నది తర్కంతో కూడిన “కార్య-కారణ సిద్ధాంతం” పై ఆధారపడి వుంటుంది

“A+B” = “C+D” అన్న సిద్ధాంతం ప్రకారమే అంతా జరుగుతూంటుంది

నిర్దిష్టమైన‘ఉష్ణోగ్రత’ మరి ‘పీడన’ కారకాల మోతాదుల వల్ల

ఒకరకమైన ఫలితం వస్తే..

సదరు ‘ఉష్ణోగ్రత’ మరి ‘పీడన’ కారకాల మోతాదులు మారితే

మరొక రకమైన ఫలితం సిద్ధిస్తుంది

ఈ విశ్వకారణ-కార్య సిద్ధాంతం శక్తి వినిమయ మూలసూత్రాలకు అనుగుణంగా పనిచేస్తూంటుంది

‘పదార్థం’ అన్నది శక్తి యొక్క ‘రూపం’ అయితే

‘శక్తి’ అన్నది సంకల్పం యొక్క ‘ప్రతిరూపం’ అవుతుంది..

‘సంకల్పం’ అన్నది చైతన్యం యొక్క నిరంతర కార్యక్షేత్రం’

చైతన్యం ఎప్పుడూ ‘స్వేచ్ఛ’ మరి ‘ఎంపిక’ అనే

శాశ్వత సూత్రాలపై ఆధారపడి పనిచేస్తూ వుంటుంది

‘చైతన్యం’ అన్నది సదా సంకల్పాలతో కూడిన మనస్సు ద్వారా పదార్థాన్ని సృష్టిస్తూ వుంటుంది

ఈ “ఆత్మవిజ్ఞాన శాస్త్రం” అనే ప్రాథమిక శాస్త్రం

సకల పాఠశాలల ద్వారా, కళాశాలల ద్వారా విద్యార్థులందరికీ

అందుబాటులోకి రావాలన్నదే “పిరమిడ్ స్పిరిచ్యువల్ సైన్స్ అకాడెమీ” యొక్క ఆకాంక్ష

అప్పుడే.. నవసమాజ నిర్మాణకర్తలైన విద్యార్థులూ, ఉపాధ్యాయులూ మరి మేధావి వర్గం..

అందరిలోనూ సమతుల్యత, సంతోషం, ఆరోగ్యం అన్నవి పరిపూర్ణంగా నెలకొంటాయి!