దత్తాత్రేయ
“ముని” అంటే “మౌని”
“వాక్ మౌనం ఉన్నవాడు” అన్నమాట
“మహా ముని” అంటే “మహా మౌనం ఉన్నవాడు” అన్నమాట
“చిత్తం వృత్తి రహితమైనవాడు” అన్నమాట
“త్రిగుణాలలో మునిగి తేలే త్రిగుణాత్మకులు”
తమకన్నా ఎక్కువుగా కండబలం, దేహ సౌందర్యం, అధికారాలు,
పదవులు, చదువులు, సంస్కారాలు ఉన్నవారి పట్ల అసూయతో,
అసూయ ద్వేషాలతో వుండడం సర్వసామాన్యం
ఆ విధంగా ఎంతో ఆత్మపరంగా ఉన్నప్పుడు కూడా
ఒక్కోసారి అసూయ ఉండవచ్చు
విశ్వామిత్రుడిలాగా – “నేను ‘రాజర్షి’ ని మాత్రమే
మరొకరు ‘బ్రహ్మర్షి ‘” అని
మనిషికి చివరిగా ఈ ” ఆధ్యాత్మిక అసూయ ” కూడా ఉండరాదు
అంటే, “మహాముని” గా అయినా “అనసూయ” తో కాపురం చేయాల్సిందే !
అసూయ లేని స్థితే ‘అనసూయ’ స్థితి
అప్పుడే, అంతా ‘దత్తం’ అవుతుంది .. సిద్ధులన్నీ వస్తాయి
అలా అష్టసిద్ధులు అన్నీ ‘దత్త’ మైన స్థితే “దత్తాత్రేయ” స్థితి
“అ+త్రి” = “అత్రి” = “త్రిగుణాలను దాటినవాడు”
“‘అత్రి’ కాని వాళ్ళు”= త్రిగుణాత్ముకులు
“ఆ సత్యంలో, ఆ ధర్మంలో వుండడం” అంటే
‘ అనసూయతో సంసారం చేయడం ”
“అప్పుడు మీ దగ్గరికే అన్నీ చేర్చబడతాయి”
అంటే “దత్తాత్రేయ స్థితి” అన్నమాట
* త్రిగుణాలు దాటి, నిర్గుణంలో విరాజిల్లుతూ “సదా అనసూయా స్థితి” లో
స్థితమైనప్పుడే సర్వసిద్ధులూ దత్తమవుతాయి