దివ్యజ్ఞానప్రకాశం

   

“మనం ఏమిటి ?”

“మనం ఎవరం ?”

“ఎక్కడి నుంచి వచ్చాం ?”

“ఎక్కడికి పోతున్నాం ?”

“ఎందుకోసం పుట్టాం ? “

“చనిపోయిన తరువాత ఏమౌతుంది ?”

“అసలు, ‘సంఘటన’ లు ఎలా జరుగుతున్నాయి ?”

“ఈ జనన-మరణ చక్ర పరమార్థం ఏమిటి ?”

“‘దైవం’ అంటే ఏమిటి ?”

“ఈ అద్భుత సృష్టిక్రమం అంతా ఎలా సాగుతోంది ?” –

– ఇలాంటి ప్రశ్నలన్నింటికీ…

పరిపూర్ణమైన సమాధానాలు స్వానుభవంతో తెలుసుకుని తదనుగుణంగా జీవించటమే “దివ్యజ్ఞానప్రకాశం కలిగివుండడం” అంటే.

 

  • ధ్యానం ద్వారా ప్రత్యక్షంగా  మరి ధ్యానుల అనుభవాలు వినడం ద్వారా, ధ్యానుల పుస్తకాలు చదవడం ద్వారా పరోక్షంగా  అందరికీ పరిపూర్ణ దివ్యజ్ఞానప్రకాశం అనతికాలంలో కలుగుతుంది.