దివ్యారోహణ శకం
1987 .. 2012
ఒకానొక సుదీర్ఘ పాతయుగం దాటి అత్యున్నత నవ్యయుగాన్ని
అమాంతంగా అత్యుత్సాహంగా ఎగిరి అందుకునే … “25 సంవత్సరాల దివ్యారోహణ శకం”
… 1987 సంవత్సరంలో ప్రారంభమై 2012 సం … లో ముగియబోతోంది
మన పాలపుంత మధ్యనుంచి ఉత్పన్నమవుతున్న
ఉచ్ఛస్థాయి శక్తిపాతమైన “ఫొటాన్ క్షేత్రం” లోకి మన సూర్యమండలం ప్రవేశిస్తూన్న
ఊర్థ్వగమన కాలమైన ఈ “దివ్యారోహణ శకం” లో ముఖ్య ఘట్టాలు –
మన సూర్యమండలం ‘ఫొటాన్ క్షేత్రం ‘ లోకి ప్రవేశించడం మొదలైన సమయం … 1987
మన సూర్యమండలం ఆసాంతం ‘ఫొటాన్ క్షేత్రం’ లోకి ప్రవేశించి, అత్యున్నతస్థాయి తరంగాలలో
పరిపూర్ణంగా ఓలలాడబోతున్న తరుణం … 2012
ఈ ఆరోహణాక్రమం నేపథ్యంలో భూమండలం ఇప్పటికే హెచ్చుస్థాయి విశ్వశక్తిని గ్రహిస్తూ..
అతి వేగవంతమైన పరిణామాలకు వేదికగా ప్రకాశిస్తోంది
పరంపరాగత మూర్ఖ మత సిద్ధాంతాలూ,ఛాందస వాదనలూ వడి వడిగా ఆవిరవుతున్నాయి
నిరంకుశత్వ ధోరణులతో వున్న సామాజిక రాజకీయ వ్యవస్థలన్నీ పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి.
సహస్రదళకమలమై వికసించిన ఆధ్యాత్మిక విజ్ఞానంతో, విశ్వమానవ స్వతంత్ర్య సుమ గీతికలతో…
ఒక బ్రహ్మాండమైన నవ్యయుగం ఆవిర్భవించబోతోంది
2012 సం … తరువాత
ప్రపంచవ్యాప్తంగా సకల దేశాల సామాజిక – రాజకీయ ఆధిపత్య బాధ్యతలను
ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు మాత్రమే నిర్వర్తిస్తారు
ఈ విశ్వవ్యాప్త నవీన యుగ ఉద్యమ రథానికి భారతదేశం కేంద్రంగా
“పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్” సారధ్యం వహిస్తోంది
క్రమంగా…
2016 సం … కల్లా
సుస్పష్టమైన ఆధ్యాత్మిక పరిపాలనలను విశ్వవ్యాప్తంగా మనం చూడగలుగుతాం
సుసంపన్న వృక్ష జంతు సామ్రాజ్యాల సహచర్యంతో ప్రకాశించే మానవ సమాజం
సంతులనమైన భూమండల పర్యావరణతో అలరారుతుంది
ఆధ్యాత్మిక వ్యవసాయం, ఆధ్యాత్మిక క్రీడలు, ఆధ్యాత్మిక కళలు …
ఇత్యాదిగా గల అన్ని రంగాల లోనూ ఆత్మజ్ఞానుల ప్రత్యేక సంఘాలు దర్శనమిస్తాయి
2020 సం.. కల్లా
ఈ విశిష్టమైన భూలోకంలో అసలుసిసలైన స్వర్గలోకం సాక్షాత్కరిస్తుంది