సవికల్ప సమాధి

 

“సమాధి” = ఆధ్యాత్మికమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు
అంతర్గతంగా దొరుకుతున్న స్థితి
“స” + “వికల్పం” = కొన్ని సంశయాలతో కూడుకుని వున్న

“చిత్తం” అన్నది ప్రశాంతస్థితికి చేరుకున్న తరువాత నుంచి
కుండలినీ జాగరణం పూర్తి అయ్యేవరకూ
ఉన్న స్థితే “సవికల్పసమాధి ” స్థితి
ఇందులో కొన్ని సూక్ష్మశరీరానుభవాలు వస్తాయి
కనుక
“‘ మనిషి ‘ అంటే కేవలం భౌతిక శరీరమే కాదు
సూక్ష్మశరీరాది సముదాయం కూడా” అని తెలుస్తుంది
కొన్ని ఇతరలోక దృశ్యాలు, కొన్ని ఇతర తలాల విశేషాలు
చూడటం కూడా జరుగుతుంది
కనుక
“ఈ భౌతికపరమైన చర్మచక్షువులకు కనబడే ప్రపంచమే కాదు
ఇంకా ఎన్నో ఇతర లోకాలు కూడ వున్నాయి” అని మనం తెలుసుకుంటాం
అయితే మన జన్మ పరంపర గురించీ, కర్మ పరంపర గురించీ,
మన పూర్ణాత్మ గురించీ ఇంకా సంపూర్ణ యదార్థ అనుభవం ఉండదు

* సమాధి స్థితి ‘సవికల్పం’ తో మొదలయి క్రమంగా అది
అనతికాలంలో ‘నిర్వికల్పం’ గా మారుతుంది