దేవాలయాలలో ధ్యానాలయాలు

 

ప్రతి దేవాలయంలో ఒక ధ్యానాలయం ఖచ్ఛితంగా ఉండితీరాలి. ధ్యానాలయం ‘పిరమిడ్’ ఆకారంలో వుంటే చాలా మంచిది. ఎందుకంటే, పిరమిడ్‌లో చేసే ధ్యానం మూడింతలు శక్తివంతం కనుక వెరసి ప్రతి దేవాలయంలోనూ ఒక పిరమిడ్ ధ్యానాలయం వచ్చి తీరాలి.

దేవాలయాల్లో భక్తులందరూ విధిగా ధ్యానం అభ్యాసం చేయాలి. భక్తులుగా దేవాలయాలలో ప్రవేశించినవారు ‘ధ్యానులు’ గా ధ్యానాలయాలలో తయారుకావాలి.

భక్తులకు దేవాలయాలు ధ్యానాన్ని ‘కానుక’ గా ఇవ్వాలి.

ఆ కానుక ఇవ్వాలంటే దేవాలయాల్లో ధ్యానాలయాలు ఉండితీరాలి.

భక్తులందరూ ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన చేయాలి. “అహం బ్రహ్మాస్మి”, “మన శ్వాసే గురువు” అని భక్తులందరూ తెలుసుకోవాలి. ప్రతి దేవాలయంలో ఒక ధ్యాన విద్యా శిక్షకుడు విధిగా ఉండితీరాలి. ప్రతి దేవాలయంలోనూ ఆత్మ విద్య, ఆత్మ జ్ఞానం విధిగా నిత్యం బోధింపబడాలి. చిన్నప్పటి నుంచే అందరూ ధ్యానం చేయాలి.

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

ధ్యానం ద్వారానే ప్రజలకు ఆరోగ్యం వస్తుంది … ఆరోగ్యమే మహాభాగ్యం. ధ్యానం చేస్తే హాస్పిటల్ ఖర్చులు, డాక్టర్ ఫీజులు, మందుబిల్లలు ఇక వుండవు.

మనస్సు ప్రశాంతంగా ఉంటేనే, శరీరం ఆరోగ్యవంతం అవుతుంది.

శ్వాస మీద ధ్యాస అభ్యాసం చేస్తేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

మనస్సు కుదుట బడితేనే దేహం కుదుట పడుతుంది.

ధ్యానంలో పరలోకాల గురించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఇహలోకంలో ఉంటూ పరలోకాల గురించి తెలుసుకోవటమే ఆధ్యాత్మిక జీవితం.

శరీరంలో ఉంటూ ఆత్మగా విరాజిల్లడమే ఆధ్యాత్మిక జీవితం.

కష్టాలలో ఉంటూ ధర్మయుతంగా జీవించడమే ఆధ్యాత్మిక జీవితం.

‘ధర్మం’ అంటే అహింస … ‘అధర్మం’ అంటే హింస ‘హింస’ అంటే జంతువధ, జంతు భక్షణ … ‘అహింస’ అంటే శాకాహారం.

ప్రతి దేవాలయంలోనూ విధిగా అహింస ప్రబోధించబడాలి.

ప్రతి దేవాలయం యొక్క కర్తవ్యం శాకాహారాన్ని విధిగా ప్రబోధించడం.

దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అవుగాక.

దేవాలయాలన్నీ ధర్మాలయాలు అవుగాక.

దేవాలయాలన్నీ ఆత్మవిద్యాలయాలు అవుగాక …