సవిరామ పరిశ్రమ
“పరిశ్రమ” అన్నది ఎప్పుడూ చేసే తీరాలి
అప్పుడే పనులు జరుగుతాయి
అప్పుడే విద్యలు అన్నీ అబ్బుతాయి
అప్పుడే కళలను పూర్తిగా నేర్చుకుంటాం
అయితే
“అవిరామ పరిశ్రమ” మాత్రం పనికిరాదు
ఎప్పుడూ “సవిరామ పరిశ్రమ” పద్ధతే సరియైనది
” స + విరామ ” = ” విశ్రాంతితో కూడిన ”
” అ + విరామ ” = ” విరామం లేని “
“అవిరామ పరిశ్రమ ” వల్ల మొదటికే మోసం వస్తుంది
“అవిరామం” అన్నది మోహం, అతి
* మోహం అన్నది అతి .. అది, ఎప్పుడూ కూడదు
అతి సర్వదా అనర్థహేతువే
* పరిశ్రమ ఎప్పుడూ ” సవిరామం ” గానే వుండాలి
అతి సర్వత్ర వర్జియేత్