సహనమే ప్రగతి
సహనమే ప్రగతి.
ఓర్చుకోవడమే నేర్చుకోవడం.
‘సహనం’ అంటే ఓర్చుకోవడమే.
‘ప్రగతి’ అంటే నేర్చుకోవడమే.
సిరిసంపదల్లో ప్రగతి … ‘ప్రగతి’ … కాదు,
వస్తువాహనాలను కూడగట్టుకునే ప్రగతి … ‘ప్రగతి’ … కాదు .
ఆత్మజ్ఞానంలోని ప్రగతే … ప్రగతి.
ఆత్మానుభవాల పరంపరే … ప్రగతి.
ప్రతి అనుభవమూ ఆత్మలోని ఒకానొక కదలిక.
సహనమే అనుభవానికి సోపానం.
అసహనమే అనుభవానికి గొడ్డలిపెట్టు.
కోరి సాధించరాదు,కోరక వచ్చింది కాదనరాదు.
వస్తూంటే ‘వస్తోందిరా’, అని సంబరపడరాదు.
పోతూంటే అయ్యో, ‘పోతోందే’, అని వెతలు పడరాదు.
ప్రతి అనుభవాన్నీ సంపూర్ణంగా స్వీకరించవలె,
అందులోని లోతుపాతుల్ని సంపూర్ణంగా చూడవలె,
అనుభవాల లోతుపాతుల్ని చూపేదే సహనం.
సహనం అంటే ఓర్చుకోవడం.
చివరిదాకా ఓర్చుకోవడం.
మహాయోగి మిలారెపాలా ఓర్చుకోవడం.
ఏసు ప్రభువులా ఓర్చుకోవడం.
అంపశయ్య మీది భీష్మ పితామహుడిలా ఓర్చుకోవడం.
సహనం జిందాబాద్.
అసహనం ముర్దాబాద్.