ధర్మం – అధర్మం

 

“ధర్మం” అంటే ?

“దేనివల్లనైతే వెంటనే ఇహ, పరలోకాల్లో అభ్యుదయమూ

పరంపరగా శాశ్వత మోక్షమూ కలుగుతాయో . .

దానిని . . ధర్మం అంటారు”

అలాగే,

ఏ కర్మల వలన, ఏ చర్యల వలన,

ఇహలోకంలో గానీ, పరలోకలలో గానీ దుఃఖం సంభవించి

ఆత్మజ్ఞానాంకురణకు ఆస్కారం ఎప్పుడు కలుగదో . .

ఆ కర్మాచరణం “అధర్మం” అనిపించుకుంటుంది

 

  • ధర్మాచరణ ఎప్పుడూ మనకే లాభకరం, కనుక అది సదా పరిగ్రహించవలసిందే
  • అధర్మాచరణ ఎల్లప్పుడూ స్వంతానికే హానికరం, కనుక అది సదా పరిత్యజించవలసింది