ధర్మం
షడ్దర్శనాలలో ఒకటయిన వైశేషికంలో “ధర్మం” గురించి చక్కటి నిర్వచనం వుంది:
“యతోభ్యుదయ నిఃశ్రేయస సిద్ధిః స ధర్మః”
యతో | = | దేనివలన |
అభి | = | పూర్తి; ఉదయం వృద్ధి (అభ్యుదయం రెండు విధాలు:1. అముష్మికం 2. ఐహికం ‘అముష్మికం’ అంటే ‘చనిపోయిన తరువాత’, ‘ఐహికం’ అంటే ‘ఈ లోకంలో వున్నప్పుడు’) |
నిఃశ్రేయస్సు | = | అంతిమ శ్రేయస్సు, ముక్తి(నిఃశ్రేయస్సు; ముక్తి, మోక్షం; అపవర్గం; నిర్వాణం; జీనత్వం – – ఇవన్నీపర్యాయపదాలే) |
సిద్ధిః | = | సిద్ధిస్తుందో |
స | = | దానిని |
ధర్మః | = | ‘ధర్మం‘ అంటారు |
“దేనివల్లనైతే వెంటనే ఇహ, పరలోకాల్లో అభ్యుదయమూ పరంపరగా శాశ్వత మోక్షమూ కలుగుతాయో – దానిని ‘ధర్మం‘ అంటారు”