భూలోకంలో మానవజన్మ ఒక ‘crash course’ వంటిది

 

ప్రతి పిరమిడ్ మాస్టర్ తమ తమ స్థోమతకు తగ్గట్లు ధ్యానం చేయటానికి పిరమిడ్ నిర్మించుకోవాలి.

అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ తప్పనిసరిగా తన స్వానుభవాలతో ఒక పుస్తకం వ్రాయాలి. ఒక్కోక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కోక్క గ్రామం దత్తత చేసుకుని ధ్యాన, జ్ఞానం బోధ చేయాలి… అది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క విద్యుక్త ధర్మం.

ప్రతి మనిషిలో వున్న షట్‍చక్రాలు ఆ మనిషి స్థాయిని తెలియచేస్తాయి. మూలధార, స్వాధిష్టాన, మణిపూరక చక్రాల స్థాయిలో వున్న మనిషి “దేవుడు ఎక్కడో బయట వున్నాడు” అని వెతుకుతడు. అలాగే అనాహత,విశుద్ధ ఆజ్ఞా చక్రాల స్థాయిలో ఉన్న మనిషి “దేవుడు నాలోనే వున్నాడు” అని వెతుకుతాడు … అయితే సహస్రార స్థాయిలో వున్న మనిషి “నేనే దేవుడు” అని తెలుసుకుంటాడు. ఇంద్రియాలను జయించిన వాడే ఇంద్రుడు.

1987 సంవత్సరం నుంచి 2012 వరకు భూమి యొక్క ఫ్రీక్వేన్సీలో వచ్చిన పెనుమార్పుల కారణంగా ఎక్కువశక్తి తరంగాలు విడుదల అవుతున్నందున ప్రతివారు ఇతోధికంగా ధ్యానం చేయాలి మరి చేయించాలి. ఈ పిరియడ్ లో ప్రతి మనిషికీ … మెడిటేటర్ అయినా, కాకపోయినా రకరకాల బాడీ పెయిన్స్ వస్తాయి… అవి అన్నీ కూడా ధ్యానం చేయటం ద్వారా నిర్మూలించుకోవాలి. 2000 సంవత్సరం ముందు పుట్టిన పిల్లలందరు కర్మఫలాలు అనుభవించటానికి పుట్టారు. 2000 సంవత్సరం తరువాత పుట్టిన పిల్లలందరూ “INDIGO Children” …వారు విశుద్ధకర్ములు… వారికి కర్మఫలాలు ఉండవు. అలాగే 2012 తరువాత జన్మించిన పిల్లలందరూ“GOLDEN Children” … అంటే పరమాత్మలే డైరెక్ట్‍గా జన్మిస్తారు. ఆత్మని ఉద్ధరించుకోవటానికి భులోకంలో మానవజన్మ ‘Crash Course’ వంటిది.