ధ్యాన గోవిందం

 

గో అంటే ఇంద్రియాలు

గోపాలుడంటే ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు

ఇంద్రియాలు ఆరు

బహిర్ముఖంగా అయిదు

అంతర్ముఖం అయిన మనస్సు – వెరసి ఆరు

ఆరు ఇంద్రియాలనూ ఆధీనంలో వుంచుకున్నవాడు గోపాలుడు

ఆత్మానుభవం ఉన్నవాడే గోపాలుడు కాగలడు.

అప్పుడే ఇంద్రియాలన్నీ వశమై సుఖాన్నిచ్చేవి.. శాంతినిచ్చేవి. అంతవరకు అపరిమిత ధోరణి లో వున్న ఇంద్రియాలు

ఆత్మానుభవం తరువాత, ఆత్మ దీప్తి తరువాత, పరిమిత మై భాసిస్తాయి.

ఇంద్రియ పరిమితత్త్వంలోనే పరమసుఖం, పరమశాంతి అన్నవి సంభవం.

“యోగః చిత్త వృత్తి నిరోధః” అన్నారు పతంజలి

అంటే, చిత్త వృత్తులు నిరోధించడమే యోగమవుతుంది అని చిత్త వృత్తి నిరోధానికి ఏకైక మార్గం సుఖమయ ప్రాణాయామం.

అథవా ఆనాపానసతి- అథవా శ్వాస మీద ధ్యాస – అథవా – పవనపుత్రులమవ్వడం – లేక మారుతీ పుత్రులవ్వడం- అంటే మన ప్రాణాధార తో మనం ఏకం కావడం.

గో అంటే ఇంద్రియాలు; గోవిందం అంటే ఇంద్రియాలకూ, మరి ప్రకృతికీ అన్నింటికీ మూలమైన ఆత్మ పదార్థం.

గోవిందా..గోవిందా.. అని కేకలేస్తూంటారు; అంటే అత్మ ఆత్మ

అని గుర్తుతెచ్చుకోవడమే అన్నమాట. తిరుపతి వేంకటేశ్వరుణ్ణి గోవిందుడు అంటారు.

వెంకటేశ్వరుడు చేసింది ధ్యానం. అయిన మనందరి నుంచి కోరేది ధ్యానం;

ధ్యానులకు తప్ప వేంకటేశ్వరస్వామి ఇతరులను ఇక సహించబోడు- తిరుపతిలో గానీ..

మరి యావత్ ప్రపంచంలో గానీ..

తలలు కాదు బోడులు – తలపులు కావాలి బోడులు; సమర్పించవలసింది

తలనీలాలు.. కాదు; మనలోని తమో; రజో దోషాలు; శ్రీ వేంకటేశ్వరుడు సూచించిన మార్గాన్నీ, జారీ చేసిన ఆజ్ఞలను, సదా అందరూ పాటించాలి.