“పౌర్ణమి ధ్యానం”
పౌర్ణమి రోజులలో చంద్రుని ప్రభావం అత్యంత ఎక్కువగా వుండటం వలన కాంతి శక్తుల ప్రసరణకు అద్భుత అవకాశం వుంటుంది. అటువంటి సమయాలలో సురక్షితంగా ఉన్నత గ్రహాంతర ప్రయోజన శక్తులతో అనుసంధానమై మానవాళికి గొప్పమేలును చేకూర్చగలం.
“జీవ పదార్థ శరీరాలు”
(proto-plasmic bodies)
పౌర్ణమి సమయంలో (జీవపదార్థ శరీరాలు అనబడే), మన అధో శరీరాలైన భౌతిక, ఉద్వేగిక నిమగ్న మానస శరీరములు చంద్రుని ప్రత్యక్ష ప్రభావం నుంచి తప్పించ బడతాయి. దానివలన ఇంతకు పూర్వమే మన అధో శరీరాలు చంద్రుని వలన కొంతవరకు కలుషితమైనప్పటికి వాటి ద్వారా మనం మన అంతర్ కాంతిని ప్రసరింపచేసే అవకాశం వుంది. అధో శరీరాలు కొద్దో గొప్పో చంద్రుని ప్రేరణ నుంచి బయట పడినప్పుడు ఉన్నత శక్తులు తమంత తాము విడుదలై మానవ శరీరంలోకి సమృద్ధిగా చొచ్చుకుపోతాయి.
“ప్రపంచ మతం”
నూతనయుగంలో లోనికి ప్రవేశించిన శక్తుల ప్రభావం వలనా, ప్రగాఢ మానవ అవగాహనతోనూ, “నూతన ప్రపంచ మతం” రూపొందించబడి ప్రతి పౌర్ణమి రోజూ పండుగగా వుంటుంది.
“ఆధ్యాత్మిక గవాక్షం”
సంవత్సరంలో మూడు ప్రధాన పౌర్ణములు ఉంటాయి. అవి చంద్రుడు మేష, వృషభ, మిధున రాశులలో వుండే పౌర్ణములు ఉంటాయి. కొన్నిసార్లు స్వర్గాలపై కారు మేఘాలు కమ్ముకున్నప్పుడు హఠాత్తుగా ఒక నీలి ఆకాశ గవాక్షం వెరచుకుని భూమిపైకి సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. పౌర్ణమి రోజులలో ఖచ్చితంగా అదే సంభవిస్తుంది … మానవాళి, అధిష్టానమండలి, శంబాలల మధ్య ఒక ఆధ్యాత్మిక గవాక్షం, తెరుచుకొని దివ్య ముద్రలలో పూరించబడిన కాంతి, ప్రేమ, శక్తి ప్రవాహాలు ప్రవహిస్తాయి.
“మే నెలలో పౌర్ణమి”
మే నెలలో వచ్చే వైశాఖపూర్ణిమను అందించినందుకు అధిష్టానమండలికి ఏమి ఇచ్చినా తక్కువే. ఆ సమయంలో సంభవించగల ఆధ్యాత్మిక ప్రకాశం అమూల్యమైనది. ఈ చంద్రోదయ సమయంలో అధిపతులు ఉపదేశకులు, శిష్యులు తమ ధ్యానం, యోచన, మార్మిక మరి పవిత్ర క్రతువులలోనూ ఇంకా వారి ప్రగాఢ ఆకాంక్ష వేడుకోలు, అనుసంధానాలతో హిమాలయాలలో గొప్ప శక్తి క్షేత్రాన్ని రూపొందిస్తారు. మూలం – టార్కోం సెరాయ్ డారియన్ గారి “ది సింఫనీ ఆఫ్ ది జోడియాక్”.