సూక్ష్మశరీర యానం
ముండకోపనిషత్తులో సూక్ష్మశరీరయానం గురించి చక్కగా చెప్పబడింది:
“యం యం లోకం మనసా సంవిభాతి
విశుద్ధ సత్తః కామయతే యాంశ్చ కామాన్,
తం తం లోకం జాయతే తాంశ్చ కామాం . . . . .”
-ముండకోపనిషత్ (3 – 10)
విశుద్ధ సత్వః | = | శుద్ధాంతఃకరణో మనిష్య |
యం యం లోకం; మనసా | = | ధ్యానేన |
సంవిభాతిః | = | ఇచ్ఛతి |
కామయతే యాంశ్చ కామాన్ | = | యంశ్చ మనోరధా నిచ్ఛతి తం తం లోకం తాంశ్చ కామాన్ |
జాయతే | = | ప్రాప్నోతి |
“పరిశుద్ధమైన మనస్సు వున్న మనిషి ధ్యానంలో ఏ లోకాలను
కోరుకుంటాడో ఆ లోకాలను చూస్తాడు”
– స్వామి దయానంద – పండిత గోపదేవ్ ఆధారంగా
- ‘ధమ్మపదం’ లో కూడా బుద్ధుడు ఇలా చెప్పాడు:
“ఆకాసే యన్తి ఇద్దియా” – అంటే
“యోగులు యోగసిద్ధి బలంతో ఆకాశంలో పయనిస్తారు” –
అని బుద్ధుడి వచనం