బ్రహ్మచర్యం

 

“భూరితి బ్రహ్మః”“భూ” అంటే

“అన్నింటికంటే గొప్పదైనది”

ఏమిటి అన్నింటికన్నా గొప్పఅయినది? ?
అన్ని పనులనూ ‘యుక్తం’ గా, తగినట్టుగా, చేయడమే
నిజానికి అన్నింటికంటే ‘గొప్పదైనది’

ఏ పనినైనా
ఏ మాత్రం ఎక్కువగా కానీ, ఏ మాత్రం తక్కువగా కానీ ఎప్పుడూ చేయరాదు
ఏ పనినైనా ఏ మాత్రం ముందుగా కానీ, ఏ మాత్రం ఆలస్యంగా కానీ
ఎప్పుడూ చేయరాదు.
ఆ విధంగా ఎప్పుడూ ‘యుక్తం’ లో చరింపబడడమే,
“బ్రహ్మచర్యం” అంటే

అంతేకానీ,
“బ్రహ్మచర్యం” అంటే . .
“స్త్రీ – పురుష సంపర్క రాహిత్యం” కాదు ;
“బ్రహ్మచర్యం” అంటే
‘దాంపత్య రాహిత్యం’, ‘శృంగార రాహిత్యం’ ఎంతమాత్రం కాదు
శృంగారానికి దూరంగా వుండడం ప్రకృతి విరుద్ధం
అయితే, దేనిలోనైనా యుక్తంగానే వుండాలి.

  • అన్నింటిలో యుక్తం గా మెలగటమే బ్రహ్మచర్యం