బ్రహ్మజ్ఞానం-ఇంద్రియవశం

 

 

“రుచం బ్రహ్మం జనయంతో దేహా అగ్రే తదబ్రువన్,

యస్వైవం బ్రాహ్మణో విద్యాత్తస్వ దేవా అసన్ వశే”

– యజుర్వేదం (31-21)

రుచం = ప్రీతికరం
బ్రహ్మం = బ్రహ్మణోపత్య మివ బ్రహ్మణః సకాశా జ్ఞాతం జ్ఞానం
జనయంత = ఉత్పాదయంతో
దేవా = విద్వాంసః
వాబ్రువన్ = బ్రువంతూపదిశంతుచ
యస్వై = యమునా ప్రకారేణ తద్ బ్రహ్మ
బ్రాహ్మణో = విద్యాత్ పశ్చాత్త్ స్వైవ
బ్రహ్మవిదో = బ్రాహ్మణస్య
దేవా = ఇంద్రియాణి
వశే = అసన్ భవంతి నాన్యస్యేతి

“బ్రహ్మజ్ఞానం ఆనందదాయకం;

అది మనుష్యులకు బ్రహ్మం లో రుచి ని పెంచుతుంది;

ఆ బ్రహ్మజ్ఞానాన్నీ, దాని సాధనాలనూ,

విద్వాంసులు ఇతర మానవులకు ఉపదేశించి వారినీ ఆనందింప చేస్తారు.

ఏ మనుష్యుడు ఈ విధంగా బ్రహ్మంను తెలుసుకుంటాడో

అలాంటి విద్వాంసుడికి

మనస్సు మొదలయిన ఇంద్రియాలన్నీ వశంలో ఉంటాయి; ఇతరులకు వుండవు”

– స్వామి దయానంద – పండిత గోపదేవ్ ఆధారంగా