ధ్యాన జ్ఞాన సాధనలు

 

 

మనిషి అల్పజ్ఞత నుంచి మహావిజ్ఞతకు చేరుకోవాలంటే చేపట్టవలసినవే ధ్యాన జ్ఞాన సాధనలు.

ధ్యాన సాధన అంటే ఆనాపానసతి – విపస్సన మార్గం.

జ్ఞాన సాధన అంటే నా కర్మలకు నేనే బాధ్యుడను; నా స్థితికి నేనే బాధ్యుడును అన్నది తెలుసుకుని సదా దైనందిన జీవితంలో జాగరూకులై ఉండడం.

ప్రతిరోజూ విధిగా ధ్యాన సాధన చేయాలి, కనీసం ఒక గంటయినా, మరి జ్ఞాన సాధన అన్నది, ప్రతిక్షణం మరచిపోకూడనిది.

ప్రపంచంలో మూడు వర్గాల వారు ఉన్నారు:

సాధనలో లేనివారు, సాధనలో వున్నవారు, మరి సిద్ధులైన వారు … అని మూడు వర్గాలుగా ప్రజలు వున్నారు. సాధనలో లేనివారు, తక్షణమే సాధకులుగా మారాలి. సాధకులుగా వున్నవారు మరి రేపో మాపో తప్పుకుండా సిద్దులౌతారు. సిద్ధులైన వారు ఇంకా సాధకులు కాని వారందరినీ సాధకులుగా చేయాలి.

ఈ ప్రపంచంలో, చిట్టచివరకు, ప్రతి మనిషీ సిద్ధుడుగా అవ్వాలి.

కనుక, ప్రతి మనిషి ధ్యాన జ్ఞాన సముపార్జన లో నిమగ్నం కావాలి, అందరినీ అంటే పిల్లలనూ – పెద్దలనూ – స్త్రీలనూ – పురుషులనూ …. చదువుకున్న వారినీ – చదువులేని వారినీ – ఈ విధంగా అందరినీ ధ్యాన యోగులు గా, జ్ఞాన యోగులు గా మలచడమే – పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్ల యొక్క ఏకైక ధ్యేయం